ఆంధ్రప్రదేశ్‌

కౌంటింగ్‌లో మార్గదర్శకాలు తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఓట్ల లెక్కింపులో కేంద్ర ఎన్నికల కమిషన్ జారీచేసిన మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఆంధ్ర, తెలంగాణ ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు వినోద్ జుటిషి నేతృత్వంలో మంగళవారం విజయవాడ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, ఇతర పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈవీఎంల ద్వారా లెక్కింపు సమయంలో ఫారం- 17సీ విషయంలో ఇప్పటికే జారీచేసిన ఉత్తర్వులు అమలు చేయాలని సూచించారు. మార్గదర్శకాలకు అనుగుణంగా ఏజెంట్లను అనుమతించాలన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో క్రమశిక్షణతో ఉండాలని, ఈసీ నిర్దేశించిన సూచనలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని విధిగా పాటించాలన్నారు. పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపు కోసం 500 ఓట్లకు ఒక కౌంటింగ్ టేబుల్ ఏర్పాటు చేయాలని సూచించారు. అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. శాంతి భద్రతల కోసం ఏర్పాట్లు చేయటంతో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవటం సులభతరమవుతుందని తెలిపారు. జుటిషి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల యంత్రాంగం తీసుకున్న చర్యలు, ప్రణాళికలు సంతృప్తి కరంగా ఉన్నాయన్నారు. ఓట్ల లెక్కింపును సమర్థవంతంగా పూర్తిచేయగలరనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లపై ప్రజల్లో ఇప్పటికే చైతన్యం వచ్చిందన్నారు. వీవీ ప్యాట్ రశీదుల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ఓట్ల లెక్కింపు సందర్భాన్ని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పరిణితితో వ్యవహరించాలని కోరారు. మచిలీపట్నం, విజయవాడ పరిధిలోని ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఈ సందర్భంగా కేంద్ర పరిశీలకులతో పాటు గోపాలకృష్ణ ద్వివేది పరిశీలించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లతో బుధవారం ఎన్నికల అధికారులు సమావేశం నిర్వహించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సానుకూలంగా స్పందించాల్సి ఉందన్నారు. మార్గదర్శకాలను కౌంటింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. లెక్కింపు కేంద్రాల్లోకి సరైన గుర్తింపు ఉన్నవారినే అనుమతించాలని స్పష్టం చేశారు. కేంద్రాల పరిధిలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. సున్నితమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎలాంటి సంఘటనలు జరక్కుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు.
ఫలితాలు వెల్లడించే సందర్భంలో తక్కువ ఓట్ల తేడాతో గెలుపు, ఓటములు ఉన్నట్లు గుర్తిస్తే పోస్టల్ బ్యాలెట్లు తప్పనిసరిగా లెక్కించాలన్నారు. ఇందులో భాగంగా తిరస్కరించిన వాటిని ముందుగా మరోసారి లెక్కించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు సీఈఒలు వివేక్ యాదవ్, సుజాత శర్మ, కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు, విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, క్షేత్రస్థాయిలో 13 జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, ఆర్వోలు, ఎన్నికల పరిశీలకులు హాజరై సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రధానంగా వీవీ ప్యాట్ రశీదులపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది సూచించారు. కౌంటింగ్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా కచ్చితంగా నియమాలను పాటించాలన్నారు.