ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ విజయం వెయ్యి శాతం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 21: ఎన్నికల ఫలితాల్లో టీడీపీ విజయం వెయ్యి శాతం ఖాయమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలోని టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 98 లక్షల మంది మహిళలు, 51 లక్షల మంది పింఛన్‌దారులు ప్రభుత్వం అమలు చేసిన పథకాలకే పట్టం కడతారని అన్నారు. రాష్ట్రానికి 655 అవార్డులు వచ్చాయని, జలవనరుల శాఖకు రూ. 70వేల కోట్లు ఖర్చు చేసి 62 ప్రాజెక్టులను పరుగులు పెట్టించినట్లు తెలిపారు. అసెంబ్లీలో ఘనవిజయం ఖాయమని, అదే విధంగా 18 నుంచి 20 పార్లమెంట్ స్థానాలు సాధిస్తామన్నారు. రాయలసీమలోని పలు ప్రాంతాలకు నీళ్లివ్వడంతో అధికంగా సీట్లు సాధిస్తామన్నారు. ఎగ్జిట్ పోల్సు చూసి సంబరపడిపోవద్దని జగన్‌కు హితవు పలికారు. 23వ తేదీన వచ్చే ఫలితాలు టీడీపీకే అనుకూలంగా ఉంటాయన్నారు. ఎన్నికలు ముగిసి 40 రోజులైనా ఒక్క సారైనా అభ్యర్థులతో సమావేశం నిర్వహించలేని నిస్సహాయ స్థితిలో జగన్ ఉన్నాడని చెప్పారు. పార్టీ అధ్యక్షుడిగా ఒక్కసారైనా మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి బ్రీఫ్‌కేసు కంపెనీలు పెట్టడానికి మాత్రమే పనికొస్తాడని, అటువంటి వారిని నమ్ముకుంటే అంతే సంగతులని జగన్‌కు సూచించారు. అభ్యర్థులకు ఇచ్చిన పార్టీ ఫండ్‌ను తిరిగి వసూలు చేసుకునే పనిలో వైసీపీ నాయకత్వం ఉందని చెప్పారు. ప్రజలు ఏం చూసి వైసీపీకి ఓటు వేస్తారని ప్రశ్నించారు.