ఆంధ్రప్రదేశ్‌

ప్రణబ్‌జీ.. ప్రజల గొంతుక వినండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 21: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజల గొంతుకను వినాలని మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి ఎమ్మెల్సీ అశోక్‌బాబు, టీడీపీ నేతలు రామానుజయ, రామకోటయ్య విజ్ఞప్తి చేశారు. ఉండవల్లి ప్రజావేదిక వద్ద మంగళవారం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సంఘం పనితీరు అద్భుతంగా ఉందని, ప్రజాస్వామంలో కీలకంగా వ్యవహరించదని మాజీ రాష్టప్రతి వ్యాఖ్యానించడం ఆయన స్థాయికి తగ్గట్లు లేదన్నారు. దేశంలో ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తే, గంటల తరబడి ఓటర్లు క్యూ లైన్లలో నిలబడటం, ఈవీఎంల మొరాయింపులు వంటివి అద్భుత పనితీరు కిందకు వస్తాయా అని ప్రశ్నించారు. ప్రజల గొంతుకను మాజీ రాష్టప్రతి వినకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో ఈసీ చేస్తున్న అక్రమాలను సామాన్యపౌరులు కూడా తప్పుపట్టారన్నారు. ఓటర్ల స్వేచ్ఛ, భద్రత ఈసీ గాలికొదిలేయడాన్ని ప్రణబ్ ఎందుకు గుర్తించలేదన్నారు. ఎన్నికల సంఘం పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నిస్తుంటే, సమాధానం చెప్పుకోలేక దిక్కులేని స్థితిలో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘం పని తీరు వివాదాస్పదంగా ఉందని ఈసీ సభ్యుడు అశోక్ లావాసా అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్‌ను లోబరుచుకుని, గెలవాలన్న మోదీ ఆశలు కలగానే మిగులుతాయని ఎద్దేవా చేశారు.