ఆంధ్రప్రదేశ్‌

మున్సిపల్ పాఠశాలల రేషనలైజేషన్ ఉత్తర్వులు జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 22: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మున్సిపల్ పాఠశాలను రేషనలైజేషన్ చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సింగిల్ టీచరును రిలీవ్ చేయకూడదని, ఇద్దరు లేక ముగ్గురు ఉంటే ఒక సీనియర్ టీచర్‌ను మాత్రమే రిలీవ్ చేయాలని, నలుగురు టీచర్లు ఉంటే ఇద్దరిని, 11 మంది ఉంటే ఆరుగురిని రిలీవ్ చేయాలని పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 12 నాటికి రిలీవ్ చేయాలని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వుల కారణంగా ఇప్పటికే బదిలీ అయిన వారికి ఆయా పాఠశాలల్లో చేరేందుకు అవకాశం ఉండదని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. రేషనలైజేషన్ వల్ల దాదాపు 97 పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సర్‌ప్లస్ టీచర్లు ఉన్న పాఠశాలలు 363 కాగా, సర్‌ప్లస్ టీచర్ల సంఖ్య 835. మూతపడే పాఠశాలలకు కావాల్సిన టీచర్ల సంఖ్య 154. మరికొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు విమర్శలు చేస్తున్నాయి.