ఆంధ్రప్రదేశ్‌

‘ఎంసెట్ కటాఫ్ మార్కులను తగ్గించండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 22: ఏపీ ఎంసెట్ కటాఫ్ మార్కులను తగ్గించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలికి ఏపీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల సంఘం విజ్ఞప్తి చేసింది. గత ఏడాది 1.53 లక్షల సీట్లు ఉండగా, ఎంసెట్‌లో 1.38 లక్షల మంది విద్యార్థులు మాత్రమే అర్హత సాధించారని గుర్తు చేశారు. ఆన్‌లైన్ టెస్టుకు తగినంత అలవాటుపడకపోవడం, చాలా మంది ఇంటర్‌లో ఫెయిల్ అవడం వంటి కారణాలతో అర్హత సాధించిన వారి సంఖ్య తక్కువగా ఉందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కటాఫ్ మార్కులను 40 నుంచి 30కు తగ్గించడం వల్ల ఎక్కువ మంది ఇంజనీరింగ్ కోర్సులకు అర్హత సాధించే వీలు కలుగుతుందని తెలిపారు. నీట్‌లో కటాఫ్ మార్కులు 13.33 శాతం ఉండగా, ఎంసెట్‌కు దాదాపు 25 శాతం వరకూ ఉంటుందని తెలిపారు.