ఆంధ్రప్రదేశ్‌

పరిస్థితులు జనసేనకే అనుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), మే 22: రాష్ట్రంలో పరిస్థితులు జనసేన పార్టీకి అనుకూలంగా ఉన్నాయని, కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మాదాసు గంగాధరం స్పష్టం చేశారు. జనసేన పార్టీకి అనుకూలంగా నిశ్శబ్ద ఓటింగ్ జరిగిందని చెప్పారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గురువారం రాబోతున్న ఎన్నికల ఫలితాలు జనసేనకు అనుకూలంగా రానున్నట్లు తెలిపారు. ఇప్పటికే పాలక, ప్రతిపక్షాలు ఉద్దేశపూర్యకంగా జనసేన పార్టీ అంటే లెక్కలేని విధంగా మాట్లాడుతున్నాయని విమర్శించారు. కేవలం జనసేన పార్టీ మాత్రమే ఈ ఎన్నికల్లో డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా పోటీ చేసిందన్నారు. సామాన్యుడికి రాజకీయ జీవితం ఇచ్చే ఉద్దేశంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాంటి వారికి ఎక్కువ సీట్లు కేటాయించారని తెలిపారు. ప్రత్యర్థి పార్టీలు ఓట్ల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశాయన్నారు. అణగారిన వర్గాలు, మైనారిటీల మద్దతుతో జనసేన పార్టీ ముందుకు వెళుతుంటే చూసి ఓర్వలేక పాలక, ప్రతిపక్షాలు ఎగ్జిట్ పోల్స్ ముసుగులో మైండ్ గేమ్ ప్రారంభించాయన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చాలా సందర్భాల్లో తలకిందులయ్యాయన్నది గుర్తుంచుకోవాలన్నారు. మొన్నీ మధ్య తెలంగాణ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ బోల్తా కొట్టిన విషయం అందరికీ తెలుసన్నారు. ఎగ్జిట్ పోల్స్ అనేది ఇప్పుడు ఒక వ్యాపారంగా మారిందన్నారు. వీటి వల్ల బెట్టింగులు కట్టి చాలా సంసారాలు నాశనం అయిపోయాయన్నారు. యువత, మహిళలు, బీసీలు, షెడ్యూల్డ్ కులాల నుండి జనసేన పార్టీకి కావల్సినంత మద్దతు లభించినట్టు పార్టీ అంతర్గత నివేదికల ఆధారంగా స్పష్టమవుతుందన్నారు. పరిస్థితులు జనసేనకే అనుకూలంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా కార్యకర్తలంతా కౌంటింగ్ సందర్భంగా తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలన్నారు. దీనిపై అవగాహన ఇచ్చేందుకు పార్టీ తరుపున ఇప్పటికే పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. ఎక్కడ ఏ మాత్రం అనుమానం వచ్చినా వాదప్రతివాదనలకు తావివ్వకుండా రిటర్నింగ్ ఆఫీసర్‌కు లిఖిత పూర్వకంగా తెలియ చెప్పాలన్నారు. ఎంతో మంది నాయకులు పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ను కలవాలని మెసేజ్‌లు పెడుతున్నారని, కానీ ఎవరూ విజయవాడ మాత్రం రావద్దన్నారు. మీ నియోజకర్గాల్లో ఉండి అభ్యర్థులకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. త్వరలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అందరినీ కలిసి మాట్లాడతారని ఆయన వివరించారు.