ఆంధ్రప్రదేశ్‌

కర్నూలు ఓటరు కనికరించిందెవరినో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 22: సార్వత్రిక ఎన్నికలకు అన్ని దశలు పూర్తయ్యాయి. ఇక ప్రజాతీర్పు ఒక్కటే స్పష్టం కావాల్సి ఉంది. ప్రజలు తమకు ఏ ప్రభుత్వం కావాలో ఇప్పటికే చెప్పేశారు. కేంద్రం, రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఏర్పాటు కానుందో నేడు తేలిపోనుంది. దేశ వ్యాప్తంగా ముగిసిన పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపును గురువారం చేపట్టనున్నారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలే కాకుండా సామాన్య ఓటరు కూడా రానున్నది ఏ ప్రభుత్వమో తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్నాడు. రాష్ట్రంలో ఓటరు ఎవరి పక్షాన ఉన్నాడో స్పష్టమవుతున్న వేళ కర్నూలు జిల్లాలో ఎవరికి ఆధిక్యత వస్తుందన్న అంశంపై ప్రజలు దృష్టి సారించారు.
జిల్లాలో 2004 నుంచి టీడీపీకి ఆశించిన ఫలితాలు రావడం లేదు. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా టీడీపీ అభ్యర్థులు గెలిచినా జిల్లాలో మాత్రం 11 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులకు విజయం కట్టబెట్టారు. రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాలో వైసీపీ అత్యధిక స్థానాలు సొంతం చేసుకుంది. కర్నూలు తరువాత కడప జిల్లాలో 9 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. లోక్‌సభ స్థానాలు సైతం 2 జిల్లాల్లోని నాలుగింటిని తన ఖాతాలో వేసుకున్న వైసీపీ ఈసారి కూడా తమ ఆధిక్యత కొనసాగుతుందన్న ధీమాతో ఉంది. జిల్లాలో మొత్తం 14 శాసనసభ, 2 లోక్‌సభ స్థానాలు ఉండగా ఓటర్లు 31,72,413 మంది ఉన్నారు. గత నెల 11వ తేదీ జరిగిన పోలింగ్‌లో జిల్లా వ్యాప్తంగా 78.28 శాతం ఓట్లు నమోదయ్యాయి. నంద్యాల లోక్‌సభ పరిధిలో 12,82,716, కర్నూలు లోక్‌సభ పరిధిలో 11,81,776 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో ఈసారి ఎన్నికల్లో గతంతో పోల్చుకుంటే సగటున 4.11శాతం మంది మహిళలు అధికంగా ఓటు వేయడం చర్చనీయాంశమైంది.
కాగా జిల్లాలో ఈసారి తమకు ఆధిక్యత వస్తుందన్న ధీమాతో ఉన్న టీడీపీ నేతలు 9 నుంచి 11 స్థానాల్లో గెలుస్తామన్న విశ్వాసంతో ఉన్నారు.