ఆంధ్రప్రదేశ్‌

ప్రజా తీర్పునకు కట్టుబడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్యాణదుర్గం, మే 22: ఈ ఎన్నికల్లో ప్రజాతీర్పు ఎలా ఉన్నా దానికి కట్టుబడి ఉంటామని పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ తీర్పుకు కట్టుబడి పని చేస్తామని తెలిపారు. ప్రజలు అవకాశం ఇస్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నారు.
తీర్పు వ్యతిరేకంగా వస్తే, వాటి సాధన కోసం పోరాటాలు చేయడానికి సిద్ధమని ఆయన తెలిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పార్టీ నేతలు ఇంటింటికి తిరిగి ప్రజల అభిప్రాయాలు, సమస్యలు సేకరించారని, వాటిని పుస్తకంలో ముద్రించామన్నారు. ప్రజలు ఏకరువు పెట్టిన సమస్యలు తీర్చడానికి పని చేస్తామని తెలిపారు. ప్రజలు తప్పకుండా తమ వెంట ఉంటారని, ఎలాంటి భయం వద్దని అన్నారు. కళ్యాణదుర్గం సమగ్రాభివృద్ధికి అందరూ కలసికట్టుగా పని చేద్దామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్, రఘువీరారెడ్డి కుమార్తె అమృత్‌వీర్, నాయకులు బాలనరేంద్రబాబు, సుధీర్, ఆశోక్, కిశోర్, శ్రీనివాసులు, కృష్ణమూర్తి, రాంభూపాల్‌రెడ్డి, పాలవెంకటాపురం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.