ఆంధ్రప్రదేశ్‌

ఏపీ ఎన్నికల ఫలితాలు:30న జగన్ ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి:ఏపీలో అధికార పార్టీకి ఓటమి తప్పలేదు. విపక్ష పార్టీ వైకాపా దాదాపు 150 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, తెలుగుదేశం ముప్పయి స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. కాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుప్పంలో గెలుపొందారు. కాగా ఈసారి చంద్రబాబు మెజార్టీ తగ్గిందనే చెప్పవచ్చు. ఆయన గత ఎన్నికల్లో 47121 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా.. ఈసారి కేవలం 28 వేల మెజార్టీతో గెలిచారు. ఇదిలా ఉండగా ఇక్కడ పలువురు మంత్రులు సైతం ఒటమి దిశగా పయనిస్తున్నారు ముఖ్యంగా నారా చంద్రబాబు తనయుడు లోకేశ్ మంగళగిరిలో వైకాపా అభ్యర్థి కంటే వెనుకంజలో ఉన్నారు. ఇక మంత్రులు సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నారాయణ తదితరులు ఓటమిపాలయ్యారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాజవాక, భీమవరం నుంచి పోటీ చేయగా గాజువాకలో ఓటమిని చవిచూశారు. ఫ్యాన్ గాలికి ఏపీలో పార్టీలన్నీ కొట్టుకుపోయాయి. నగరిలో వైకాపా అభ్యర్థి రోజా గెలిచారు.