ఆంధ్రప్రదేశ్‌

జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 23: అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి వైకాపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని తేలడంతో ఆ పార్టీ అధినేత జగన్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన సీఎస్.. ఆయనను అభినందించారు. తాజా రాజకీయ పరిణామాల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలిసింది. మర్యాదపూర్వకంగా వివిధ విభాగాల ఐఏఎస్, ఐపీఎస్ ఇతర ఉన్నతాధికారులు కూడా జగన్‌ను కలిగి అభినందించారు. కాగా, త్వరలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న జగన్‌కు రాష్ట్రానికి సంబంధించి ప్రాధాన్యతాంశాల గురించి వివరించేందుకు సీఎస్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సమగ్ర నివేదిక సిద్ధం చేయమని వివిధ శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిధుల లభ్యత, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలతో నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
సీఎస్‌గా కొనసాగనున్న ఎల్వీ
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వీ సుబ్రహ్మణ్యం కొనసాగనున్నారు. తాడేపల్లిలో వైకాపా అధినేత జగన్‌ను ఆయన గురువారం కలిసినప్పుడు ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎస్‌గా ఉన్న అనిల్ చంద్ర పుణేఠాపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసి, ఆ స్థానంలో ఎల్వీని నియమించడం తెలిసిందే. అయితే సీఎస్ నియామకంపై ఊహాగానాలు వినవస్తున్న తరుణంలో వీటికి జగన్ తెరదించుతూ ఎల్వీనే కొనసాగాలని చెప్పారు. 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జూన్ 1 నుంచి 5 వరకూ వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి హోదాలో సమీక్షించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మాజీ సీఎస్ అజయ్ కల్లాంను నియమిస్తున్నట్లు తెలిపారు. కల్లాంతో కలిసి పని చేయాలని ఎల్వీకి సూచించారు. ఇలాఉంటే అఖిల భారత సర్వీసు అధికారులు శుక్రవారం ఉదయం 11 గంటలకు జగన్‌ను కలువనున్నారు.