ఆంధ్రప్రదేశ్‌

పుష్కరాలతో ప్రతిష్ఠ పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 5: మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాలు చరిత్రలో మిగిలిపోయేలా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. విజయవాడలోని ఎ ప్లస్ కనె్వన్షన్ సెంటర్‌లో కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల అధికారులతో కృష్ణాపుష్కరాలపై శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మన ఇంటికి బంధువులు వస్తే ఎలా గౌరవిస్తామో, పుష్కరాలకు వచ్చే యాత్రికులను అలా గౌరవించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పుష్కరాలంటే ప్రకృతిని ప్రేమించి నదికి రుణం తీర్చుకోవటానికే పుష్కరాలు నిర్వహిస్తామని తెలిపారు. గత గోదావరి పుష్కరాల దుర్ఘటన ఇప్పటికీ తన మనస్సు కలిచి వేస్తూనే ఉందని, జరిగిన సంఘటనకు అప్పడే ప్రజలకు క్షమాపణ చెప్పానని గుర్తుచేశారు. ఆ దుర్ఘటన జరగటానికి క్యూ పద్ధతి పాటించకపోవడమేనని అన్నారు. కృష్ణా పుష్కరాల్లో అటువంటి దుర్ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. 2004 కృష్ణా పుష్కరాలలో విజయవాడ కృష్ణా బ్యారేజి వద్ద జరిగిన సంఘటనలో ఏడుగురు చనిపోయిన సంఘటనను గుర్తుంచుకొని ఈ పుష్కరాలలో ఏ చిన్న సంఘటన జరకుండా పుష్కరాలు విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారి, సిబ్బందిపై ఉందని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 170 పుష్కర ఘాట్లలో సి.సి.కెమెరాలు, ద్రోణ్‌లను, ప్రత్యేకంగా కృష్ణా పుష్కరాల కోసం మైక్రోసాఫ్ట్ రూపొందించిన ‘కైజాల’ యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు. యాత్రికుల పట్ల పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులుగా మెలగాలని అన్నారు. ప్రత్యేకంగా పుష్కరాలకు వచ్చే యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన పుష్కర నగర్‌లో టిటిడి, అక్షయ పాత్ర, ప్రైవేటు సంస్థలు ఉచిత భోజనాలు ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని తెలిపారు. ఈ నెల 11 సాయంత్రం గోదావరి అంత్య పుష్కరాలలో తాను పాల్గొని అదే రోజు రాత్రి విజయవాడలో కృష్ణా పుష్కరాలకు అంకురార్పణ చేస్తానని చంద్రబాబు చెప్పారు. సమావేశంలో కృష్ణా పుష్కరాల ఇన్‌చార్జి రాజశేఖర్, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు బాబు.ఎ, కాంతిలాల్ దండే, ఎం.పి. కేశినేని నాని, విజయవాడ మేయర్ కోనేరు శ్రీ్ధర్ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, జాయింట్ కలెక్టర్లు, డెప్యూటీ కలెక్టర్లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా కోసం పోరాడాలి

వైకాపా నేత శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 5: ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణ పుష్కరాలకు తాను ఎంతో చేస్తున్నానంటూ చేసుకుంటున్న పబ్లిసిటీని తగ్గించుకుని ప్రత్యేక హోదాపై దృష్టిని సారించాలని వైకాపా శాసనసభాపక్ష ఉపనేత జి శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదాపై చంద్రబాబు చేసిన పరస్పర విరుద్ధమైన ప్రకటనలు, రాజకీయ పక్షాలను కలుపుకుని పోరాడాలన్న ఇంగిత జ్ఞానం లేనందు వల్ల హోదా దక్కడం లేదన్నారు. గత ఏడాది గోదావరి నది పుష్కరాలకు చంద్రబాబు చేసిన హడావుడి అంతా ఇంతాకాదన్నారు. చంద్రబాబు రెచ్చిపోయి వీడియో షూటింగ్‌కు అనుమతి ఇవ్వడం వల్ల, రద్దీ పెరిగి 30 మంది మరణించారన్నారు. దీనిపై విచారణకు నియమించిన కమిటీ నివేదిక ఇంతవరకు వెలుగుచూడలేదన్నారు. ఈ కమిటీ కూడా చంద్రబాబును కలిసి ఆ రోజు జరిగిన ఘటనపై సమాచారం తీసుకోలేదన్నారు. ప్రత్యేక హోదాపై అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని పోయే సంస్కృతి చంద్రబాబుకు లేదన్నారు. కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే విధంగా వత్తిడి తీసుకునేందుకు అన్ని పక్షాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
రాయలసీమకు నీరు వదలండి
శ్రీశైలంలో నీటి మట్టం 837 అడుగులకు చేరుకుంటోందని, వెంటనే పోతిరెడ్డి పాడు ద్వారా రాయలసీమకు సాగునీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎడాపెడా జల విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల వచ్చిన నీరు దిగువకు పోతుందని, దీని వల్ల రాయలసీమకు జలాలు అందవన్నారు. గత రెండేళ్లలో చంద్రబాబు హ్రస్వదృష్టి విధానాల వల్ల రాయలసీమకు సాగునీరు అందకుండా పోయిందన్నారు.

ఈ ఏడాది అయినా ముందుచూపుతో వ్యవహరించి సీమ జిల్లాల రైతాంగ హక్కులను పరిరక్షించాలని ఆయన కోరారు.