ఆంధ్రప్రదేశ్‌

వైసీపీ ఘన విజయంలో ‘ఐ-ప్యాక్’ వ్యూహం!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 24: గత రెండేళ్లుగా ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రశాంత్ కిషోర్ టీం వైసీపీ ఘన విజయంలో కీలకపాత్ర పోషించింది. టీంలో కొందరు కీలక వ్యక్తులు ఐ-ప్యాక్‌ను నడిపిస్తూ పార్టీని విజయబావుటాలో ఎగురవేశారు. ప్రశాంత్ కిషోర్ టీం వైసీపీ తరఫున తమ ప్రచారాన్ని మే, 2017లో ప్రారంభించింది. 709 రోజుల తమ ప్రణాళికల్ని అమలు చేసి వ్యూహం ప్రదర్శించింది. వైసీపీ తరఫున ఐ-ప్యాక్ మొత్తం 35 ప్రధాన ప్రచార కార్యక్రమాలను చేసింది. అందులో 18 టీంలు ఆన్‌లైన్ విప్లవం కోసం పనిచేస్తే, మరో 17 టీంలు క్షేత్రస్థాయి ప్రచారాన్ని చేపట్టింది. ప్రచారానికి మొదటి అస్త్రంగా ఐ-ప్యాక్ పార్టీని క్షేత్రస్థాయిలో బూత్ క్యాడర్‌ని బలోపేతం చేసింది. అదే విధంగా పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తూ వారికి మార్గదర్శకత్వం వహించింది. ఐ-ప్యాక్ సరైన వ్యూహాన్ని నిర్దేశించటం వల్ల పార్టీ ఘనవిజయాన్ని సాధించింది అనటంలో అతిశయోక్తి లేదు. ప్రశాంత్ కిషోర్ టీం ముందునుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయటంలో దృష్టి సారించింది. అందులో భాగంగా ప్రతీ నియోజకవర్గంలో టీం సభ్యులు క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ బలమైన నాయకులను పార్టీకి అనుసంధానం చేస్తూ, బలహీనమైన నాయకులకు శిక్షణ ఇస్తూ ముందుగు సాగారు. అలాగే డిజిటల్ పరంగా కూడా పార్టీని బలోపేతం చేస్తూ అధికార పార్టీకి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇవ్వడంలో ఒక విప్లవాత్మక ‘మార్పు’నకు నాంది పలికారు. ఐ-ప్యాక్ ప్రోద్బలంతో అప్పటి నుంచి పార్టీ కార్యకర్తలు కూడా ఉత్సహంగా పనిచేయడం ప్రారంభించారు. ఐ-ప్యాక్ కొన్ని కీలక వ్యూహాల్ని అమలు చేసి ప్రజల నాడి పసిగట్టగలిగింది. సంస్థ చేసిన ప్రచారాలన్నీ ప్రజల్లో జగన్ పట్ల పాజిటివ్ భావన్ని పెంపొందేలా చేశాయి. ఐ-ప్యాక్ చేసిన ‘రావాలి జగన్ - కావాలి జగన్’ పేరుతో ప్రచార కార్యక్రమమైతే ఏపీలో ప్రతి గడపకూ తాకింది. ఐ-ప్యాక్ చేసిన మరో ప్రధాన ప్రచార కార్యక్రమం ‘నిన్ను నమ్మం బాబు’. ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది. అందరికీ ఈ కార్యక్రమం డిజిటల్ పరంగా ఒక అధికార పార్టీ పట్ల తుపానులా మారి వారి అధికారం కొట్టుకుపోయేలా చేసింది.
‘రావాలి జగన్ - కావాలి జగన్’ పేరిట ఐ-ప్యాక్ రూపొందించిన ప్రచార గీతం సోషల్ మీడి యా, యూ ట్యూబ్‌లో ఒక చరిత్ర సృష్టించింది. దాదాపు 3కోట్ల ప్రజలకు ఈ గీతం చేరువై అధికార పార్టీ గుండెల్లో గుబులు పుట్టించింది. గత రెండేళ్లుగా ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి జగన్‌కు మర్చిపోలేని విజయాన్ని అందించిన ప్రశాంత్ కిషోర్ టీం దక్షిణ భారతదేశంలో ఒక పార్టీకి ఘనవిజయాన్ని అందించి భారత రాజకీయాల్