రాష్ట్రీయం

అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటును అడ్డుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి, ఆగస్టు 6: ప్రాణాంతకమైన అణువిద్యుత్ కేంద్రాలను అంతర్జాతీయంగా ఒక్కొక్క దేశం నిలుపుదల చేసుకొంటూ వస్తుంటే మన దేశంలోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో నెలకొల్పాలని చంద్రబాబు సర్కార్ ప్రయత్నాలు చేస్తోందని, ఈ ప్రయత్నాలను ప్రజలతో కలిసి అడ్డుకుంటామని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తన కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రెండు రోజుల క్రితం ఈ ప్రాజెక్ట్‌కు సంబందించి ప్రత్యేక బృందం చెన్నాయపాలెం ప్రాంతంలో పర్యటించిన విషయం తెలుసుకొన్న అయిన దానిని ఎలాగైనా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో వ్యూహాత్మక అంశాలపై కార్యకర్తలతో సమాలోచనలు జరిపారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ తీరంలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటువల్ల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. అందువల్ల దాన్ని ఏర్పాటుచేయకుండా అడ్డుకుంటామన్నారు. అణు విద్యుత్ ప్రాజెక్ట్‌కు బదులు ప్రజా సంక్షేమం కోసం ఓడరేవును మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.