ఆంధ్రప్రదేశ్‌

సికిందరాబాద్-్భవనేశ్వర్ మధ్య 20 వేసవి ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 24: ప్రస్తుత వేసవికాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్-్భవనేశ్వర్‌ల మధ్య 20 ప్రత్యేక రైళ్లను నడుపబోతున్నది. 02784 నెంబర్‌లో ప్రత్యేక రైలు ఈ నెల 29వ తేదీ జూన్ 1,5,8,12,15,19,22,26,29 తేదీల్లో మధ్యాహ్నం 12.30కు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.30కు భువనేశ్వర్ చేరుతుంది. 02783 నెంబర్‌తో మరో రైలు ఈ నెల 30, జూన్ 2,6,9,13,16,20,23,27,30 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది. ఈ రైళ్లు ఖాజీపేట, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం, పలాస రైల్వేస్టేషన్‌ల్లో ఆగుతాయి.