ఆంధ్రప్రదేశ్‌

ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో మాగుంట సరికొత్త రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మే 24: ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డి రికార్డు స్థాయి మెజారిటీ సాధించారు. తన రికార్డును తానే బద్దలుకొట్టారు. 2,14,851 ఓట్ల మెజారిటీని మాగుంట కైవసం చేసుకున్నారు. 2004లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 1.04 లక్షల మెజారిటీతో మాగుంట గెలుపొందారు. 1977లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి 1.70లక్షల ఓట్ల మెజారిటీ సాధించినట్లు సమాచారం. ఆ ఆభ్యర్థి రికార్డును సైతం బద్దలుకొట్టి తన సమీప ప్రత్యర్థి రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావుపై మాగుంట శ్రీనివాసులరెడ్డి 2,14,851లక్షల మెజార్టీతో విజయం సాధించారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఏ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనూ టీడీపీ అభ్యర్థి శిద్దా రాఘవరావుకు మెజార్టీ లభించలేదు. కొండేపి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి డోలా బాల వీరాంజనేయస్వామి విజయం సాధించగా, ఆ నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ జరిగి వైకాపా అభ్యర్థి మాగుంటకు మెజారిటీ లభించింది. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డికి 739201 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి శిద్దా రాఘవరావుకు 524351 ఓట్లు వచ్చాయి. యర్రగొండపాలెంలో మాగుంటకు 97352 ఓట్లు, శిద్దా రాఘవరావుకు 67236 ఓట్లు, దర్శి నియోజకవర్గంలో మాగుంటకు 106139 ఓట్లు, శిద్దా రాఘవరావుకు 76582 ఓట్లు, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో మాగుంటకు లక్షా 797 ఓట్లు, శిద్దా రాఘవరావుకు 76994 ఓట్లు, కొండేపి నియోజకవర్గంలో మాగుంటకు 97481 ఓట్లు, శిద్దా రాఘవరావుకు 95604 ఓట్లు వచ్చాయి. అదే విదంగా మార్కాపురం నియోజకవర్గంలో మాగుంటకు 91324 ఓట్లు, శిద్దా రాఘవరావుకు 76760 ఓట్లు, గిద్దలూరు నియోజకవర్గంలో మాగుంటకు 127294 ఓట్లు, శిద్దా రాఘవరావుకు 50210 ఓట్లు, కనిగిరి నియోజకవర్గంలో మాగుంటకు 108777 ఓట్లు, శిద్దా రాఘవరావుకు 72091 ఓట్లు వచ్చాయి. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శిద్దా రాఘవరావుకు ఎదురుదెబ్బే తగిలింది. గత అసెంబ్లీలో దర్శి నియోజకవర్గం నుంచి మంత్రి శిద్దా రాఘవరావు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆ నియోజకవర్గంలోనూ శిద్దా రాఘవరావుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గంలో మూడువేల కోట్ల రూపాయల అభివృద్ధి చేశానని, తన గెలుపు నల్లేరు మీద నడకేనని చెప్పుకున్న శిద్దా రాఘవరావుకు దర్శి నియోజకవర్గ ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. కాగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందినట్లు ఎన్నికల అధికారి వినయ్‌చంద్ నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డి శుక్రవారం తెల్లవారుజామున ఐదుగంటలకు సర్ట్ఫికెట్ అందుకున్నారు. ఈ సందర్భంగా మాగుంటను పలువురు వైకాపా నాయకులు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. శుక్రవారం మాగుంట కార్యాలయం సందర్శకులతో కిటకిటలాడింది. నియోజకవర్గ పరిధిలోని ఒంగోలు, కొండేపి, కనిగిరి, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాలకు చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలు, మాగుంట అభిమానులు ఆయను కలిసి పూలమాలలతో, బొకేలతో ముంచెత్తారు.