ఆంధ్రప్రదేశ్‌

మోదీ నాయకత్వంలో చారిత్రక విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 24: దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాల్లో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని భాజపా జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ చారిత్రక విజయాన్ని సాధించిందని తెలిపారు. సొంతంగా మెజార్టీ తెచ్చుకోవడం వెనుక మోదీపై ప్రజల్లో ఉన్న నమ్మకం మరోసారి రుజువైందన్నారు. మోదీ ఐదేళ్ల పాలన, సాధించిన విజయాలు, సంక్షేమ పథకాలు విశ్వాసాన్ని పెంచాయన్నారు. శత్రు దేశం సైతం తప్పు చేయడానికి భయపడేలా మోదీ పాలన సాగిందని ప్రశంసించారు. ప్రజా రంజక పాలన చేస్తే మళ్లీ ప్రజలు అధికారం కట్టబెడతారని నిరూపించారని చెప్పారు. మోదీతో జతకట్టిన వాళ్లు కూడా ఈ ఎన్నికల్లో లాభపడ్డారని అన్నారు. ఏపీలో కూడా రాజకీయ శక్తిగా ఎదిగేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఏపీలో ఘన విజయం సాధించిన జగన్‌కు బీజేపీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. మంచి పాలన అందిస్తారని చెప్పిన జగన్ మాటలను ప్రజలు విశ్వసించారని దానిని నిలబెట్టుకోవాలని సూచించారు. జగన్ భారీ విజయానికి టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కారణమని అన్నారు. నియంతృత్వ పోకడలు, హద్దుమీరిన అహంకారం కూడా టీడీపీ పరాజయానికి కారణమని చెప్పారు. జగన్‌పై దాడి జరిగితే కోడి కత్తి అని అవహేళన చేయడం చంద్రబాబు స్థాయికి సరికాదని అన్నారు. ఇటువంటి అహంకారం, అపహాస్యం వంటి ఘటనలే టీడీపీ మహా పరాజయానికి కారణాలుగా పేర్కొన్నారు. ఇప్పటికైనా సమీక్ష చేసుకుని చంద్రబాబు మారతారని ఆశిస్తున్నామన్నారు. ఏపీలో తమకు లాభించకపోయినా... చంద్రబాబు ప్రభుత్వం అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు. టీడీపీ చేసిన నేర పూరిత, కుట్ర పూరిత రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. ఈ ఎన్నికలు ఎంతో మందికి ఎన్నో గుణపాఠాలు నేర్పాయని, తాము వైఫల్యం చెందడానికి కారణాలను సమీక్ష జరుపుతామన్నారు. తెలంగాణలో పుంజుకుంటున్న విధంగా ఏపీలో కూడా తమ పార్టీ విజయం సాధించేలా కార్యాచరణతో ముందుకు వెళతామన్నారు. తమపై కుట్రలు చేయాలని భావించిన టీడీపీయే చతికిలపడిందని, కొత్తగా వచ్చినవారు కుట్ర రాజకీయాలు కాకుండా హుందాగా ఉంటారని ఆశిస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో వంశపారంపర్య రాజకీయాలకు విఘాతం కలిగిందన్నారు. కేంద్రం ఏపీకి ఎన్నో నిధులు, సంస్థలు ఇస్తే అవన్నీ తనగొప్పగా చంద్రబాబు ప్రచారం చేసుకుని కేంద్రంపై బురద చల్లారని, జగన్, బీజేపీ మధ్య బంధం ఉందని అసత్యాలు ప్రచారం చేశారని అన్నారు. అందుకే ప్రజలు తిరస్కరించారని చెప్పారు. కొత్త ప్రభుత్వం అయినా మంచి రాజకీయం చేసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని అభిప్రాయపడ్డారు.