ఆంధ్రప్రదేశ్‌

జగన్ మెజారిటీ 90,110

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, మే 24: కడప జిల్లా పులివెందుల నుంచి గెలిచిన వైకాపా అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి భారీ మెజారిటీ దక్కింది. ఆయన తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి సతీష్‌రెడ్డిపై 90,110 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. పులివెందుల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జగన్‌కు ఆధిక్యత లభించింది. మొత్తం నియోజకవర్గంలో 2,23,411 మంది ఓటర్లు ఉండగా 1,80,663 ఓట్లు పోలయ్యాయి. వీటిలో జగన్‌మోహన్‌రెడ్డికి 1,32,356 ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం అభ్యర్థి సతీష్‌కుమార్‌రెడ్డికి 42,246 ఓట్లు వచ్చాయి. సతీష్‌రెడ్డిపై 90,110 ఓట్ల భారీ మెజారిటీతో జగన్ గెలుపొందారు. మండలాల వారీగా చూస్తే సింహాద్రిపురం మండలంలో 24,755 ఓట్లు ఉండగా 21,720 ఓట్లు పోలయ్యాయి. జగన్‌కు 15,943, సతీష్‌రెడ్డికి 5,033 ఓట్లు రాగా, వైకాపాకు 10,910 మెజారిటీ లభించింది. అలాగే లింగాలలో 22,506 ఓట్లు ఉండగా 20,268 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 15,780 ఓట్లు జగన్‌కు రాగా 3,869 ఓట్లు సతీష్‌కు వచ్చాయి. వైకాపాకు 11,911 మెజారిటీ వచ్చింది. పులివెందుల రూరల్‌లో 9,870 ఓట్లలో 8,477 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 6,860 ఓట్లు జగన్‌కు రాగా 13,67 ఓట్లు సతీష్‌కు వచ్చాయి. వైకాపాకు 5,493 మెజారిటీ దక్కింది. పులివెందుల అర్బన్‌లో 53,586 ఓట్లలో 39,872 ఓట్లు పోలయ్యాయి. 30,790 ఓట్లు జగన్‌కు రాగా 6,904 ఓట్లు సతీష్‌కు వచ్చాయి. వైకాపాకు 23,886 మెజారిటీ దక్కింది. వేముల మండలంలో 21,902 ఓట్లు ఉండగా 18,801 ఓట్లు పోలయ్యాయి. జగన్‌కు 13,445 ఓట్లు రాగా సతీష్‌కు 4,793 ఓట్లు పోలయ్యాయి. వైకాపాకు 8,652 మెజారిటీ దక్కింది. తొండూరులో 18,860 ఓట్లకు గాను 16,387 పోలయ్యాయి. జగన్‌కు 11,529, సతీష్‌కు 4,328 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వైకాపా 7,201 మెజారిటీ సాధించింది. వేంపల్లెలో 45,552 ఓట్లకు గాను 34,361 ఓట్లు పోలయ్యాయి. ఇందులో జగన్‌కు 23,449 ఓట్లు, సతీష్‌కు 9,803 వచ్చాయి. వైకాపా ఇక్కడ 13,646 మెజారిటీ సాధించింది. చక్రాయపేటలో 26,381 ఓట్లుండగా 20,777 పోలయ్యాయి. 13,980 జగన్‌కు రాగా 5,971 సతీష్‌కు వచ్చాయి. 8,009 మెజారిటీ వైకాపాకు వచ్చింది. మొత్తం ఏడు మండలాలు, పులివెందుల మున్సిపాలిటీలో పూర్తి ఆధిక్యం జగన్‌కు రావడం గమనార్హం.
జగన్‌ను కలిసిన ఐఏఎస్, ఐపీఎస్‌లు

విజయవాడ, మే 24: వైకాపా అధినేత, త్వరలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న జగన్‌మోహన్‌రెడ్డిని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్ద అధికారులతో, పార్టీ నేతలతో కోలాహలంగా కనపించింది. 23 శాఖలకు చెందిన 57 మంది ఉన్నతాధికారులు జగన్ కలిసి అభినందనలు తెలిపారు. తరువాత తమ శాఖకు సంబంధించి తాజా వివరాలతో ఒక నివేదికను అందచేశారు.