ఆంధ్రప్రదేశ్‌

తూర్పు పార్లమెంటు స్థానాల్లో జనసేన ఎఫెక్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 26: తూర్పు గోదావరి జిల్లాలో మూడు లోక్‌సభా స్థానాలు ఉండగా అందులో రెండు స్థానాల్లో వారసులు నిలబడ్టారు. లోక్‌సభ, శాసన సభ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ తరపున రాజకీయ నాయకుల వారసులు పోటీకి దిగారు. పోటీ చేసిన స్థానాల్లో ఇద్దరు ఎంపీలుగానూ, ముగ్గురు ఎమ్మెల్యేలుగానూ నెగ్గారు. ప్రధానంగా ఎంపీ స్థానాల్లో జనసేన టీడీపీ విజయంపై తీవ్ర ప్రభావం చూపింది.
అమలాపురం లోక్ సభా స్థానంలో స్వర్గీయ జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్ మాధుర్‌ను టీడీపీ రంగంలోకి దింపింది. ఇక్కడ హరీష్ మాధుర్‌కు 4 లక్షల 38వేల 808 ఓట్లు లభించాయి. ఓఎన్జీసీ రాజమహేంద్రవరం బేస్ అసెట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తూ రాజీనామా చేసి అమలాపురం ఎంపీ స్థానంలో జనసేన అభ్యర్ధిగా పోటీలోకి దిగిన డిఎంఆర్ శేఖర్‌కు 2 లక్షల 51వేల ఓట్లు లభించాయి. జనసేకు వచ్చిన ఓట్లన్నీ టీడీపీకి పడాల్సిన ఓట్లుగానే భావించాల్సి ఉంది. ఇక్కడ జనసేనకు పడిన ఓట్లలో కనీసం ఏభై వేల ఓట్లు టీడీపీకి పడి ఉంటే జీఎంసీ బాలయోగి వారసుడు గంటి హరీష్ మాధుర్ విజయం సాధించి ఉండేవారు. వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన మరో వారసురాలు చింతా అనూరాధకు 4లక్షల 76వేల 444 ఓట్లు రాగా 37వేల 636 ఓట్ల మెజార్టీతో టీడీపీపై విజయం సాధించారు. జనసేనకు పడిన ఓట్లలో కనీసం యాభై వేల ఓట్లు టీడీపీ అభ్యర్ధికి పడి ఉంటే, ఇక్కడ విజయం టీడీపీదే. కాపు సామాజకవర్గం ఓట్లు అధికంగా ఉన్న అమలాపురం పార్లమెంట్ పరిధిలో ఆ వర్గం ఓట్లు పట్టుదలగా వేసుకోవడం వల్ల టీడీపీకి వ్యతిరేకంగా పడ్డాయని తెలుస్తోంది. టీడీపీకి పడాల్సిన ఓట్లే జనసేనకు అయాచితంగా పడటంతో మధ్యలో టీడీపీ నష్టపోయిందని స్పష్టంగా తెలుస్తోంది.
ఇక రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూప ఘోర పరాజయం పాలయ్యారు. ఇక్కడ బీసీ సంఘాల రాష్ట్ర నేత మార్గాని నాగేశ్వరరావు కుమారుడు వైసీపీ నుంచి మార్గాని భరత్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. భరత్‌కు 5 లక్షల 72వేల 620 ఓట్లు లభించాయి. జనసేన అభ్యర్ధి డాక్టర్ ఆకుల సత్యనారాయణకు లక్షా 53వేల 658 ఓట్లు లభించాయి. ఈ ఓట్లు కూడా టీడీపీకి పడి ఉంటే టీడీపీ అభ్యర్ధి విజయావకాశాలు మెరుగుపడి ఉండేవని స్పష్టమవుతోంది. ఏదేమైన్పటికీ లోక్‌సభ స్థానాల్లో టీడీపీ వారసులకు జనసేన ఎఫెక్టు వల్ల ఓటమి చవి చూసినట్టు తెలుస్తోంది.
కాకినాడ పార్లమెంట్‌లో జనసేనకు లక్షా 31వేల 749 ఓట్లు లభించాయి. టీడీపీ అభ్యర్ధికి 5 లక్షల 10వేల 321 ఓట్లు, వైసీపీకి 5 లక్షల 35వేల 764 ఓట్లు లభించాయి. జిల్లాలోని పార్లమెంట్లలో కూడా జనసేన ఎఫెక్టు తీవ్రంగానే కనిపించింది.
ఇదిలా ఉండగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు, దివంగత మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రంన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవాని పోటీ చేసి విజయం సాధించారు. రాజానగరం అసెంబ్లీ నుంచి దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు కుమారుడు జక్కంపూడి రాజా వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. జక్కంపూడి రామ్మోహనరావు వైఎస్ మరణానంతరం వైసీపీలో చేరి జక్కంపూడి సతీమణి విజయలక్ష్మి ఈ సీటును ఆశించినప్పటికీ జక్కంపూడి రాజకీయ వారసునిగా రాజా రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో జక్కంపూడి విజయలక్ష్మి పోటీ చేస్తే ఈ సారి ఆమె కుమారుడు పోటీ చేశారు.
అమలాపురం లోక్‌సభా స్థానం నుంచి లోక్‌సభ మాజీ స్పీకర్ దివంగత జీఎంసి బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాధుర్‌ను టీడీపీ రంగంలోకి దింపింది. ఇదే స్థానం నుంచి గత ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయిన చింతా కృష్ణమూర్తి కుమార్తె చింతా అనురాధ పోటీ చేశారు. చింతా కృష్ణమూర్తి 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధిగా అమలాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరి సమన్వయకర్తగా పని చేశారు. ఆయన రాజకీయ వారసురాలిగా అనూరాధ ఇక్కడి నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి జి ఎంసి బాలయోగి కుమారుడిపై విజయం సాధించారు.
మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ కుమారుడు ముత్తా శశిధర్ కాకినాడ అసెంబ్లీ స్థానం నుంచి జనసేన తరపున పోటీ చేశారు. శశిధర్ తండ్రి గోపాలకృష్ణ మంత్రిగా పని చేశారు. కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే చిర్ల సోమసుందరరెడ్డి కుమారుడు చిర్ల జగ్గిరెడ్డి రెండో సారి బరిలోకి సమీప టీడీపీ అభ్యర్ధిపై అత్యధిక మెజార్టీతో గెలిచారు. కాకినాడ ఎంపీగా పనిచేసిన తోట నర్శింహం సతీమణి, వీరవరం గ్రామ సర్పంచ్ తోట వాణి పెద్దాపురం అసెంబ్లీ స్థానం నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్పపై పోటీ చేశారు. తోట నర్శింహం వారసురాలుగా పోటీ చేసిన ఆమె ఇక్కడ పరాజయం పాలయ్యారు. తుని అసెంబ్లీ నియెజకవర్గం నుంచి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి దాడిశెట్టి రాజాపై ఘోర పరాజయం పాలయ్యారు.ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మనుమడు, డీసీసీబి ఛైర్మన్ వరుపుల రాజా టీడీపీ నుంచి ఆయన వారసుడుగా పోటీ చేశారు. వైసీపీ అభ్యర్ధి పర్వత పూర్ణచంద్రప్రసాద్‌పై ఓడిపోయారు.
రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మాగంటి మురళీమోహన్ వారసురాలుగా ఆయన కోడలు మాగంటి రూప టీడీపీ నుంచి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన మార్గాని భరత్ కూడా ఒకపుడు టీడీపీ సీనియర్ నేతగా, ప్రస్తుతం బీసీ సంక్షేమ సంఘాల కన్వీనర్‌గా వున్న మార్గాని నాగేశ్వరరావు వారసుడుగా పోటీలోకి దిగారు. వైసీపీ అభ్యర్ధిగా లక్షా 17వేల ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు.
జిల్లాలోని మూడు ఎంపీ స్థానాల్లో రాజమహేంద్రవరం, అమలాపురం ఎంపీ స్థానాల్లోనూ, తుని, రాజమహేంద్రవరం సిటీ, కాకినాడ సిటీ, ప్రత్తిపాడు, కొత్తపేట, రాజానగరంలలోనూ వారసులు పోటీ చేశారు. రాజమహేంద్రవరం, అమలాపురం లోక్‌సభా స్థానాల్లో వైసీపీ అభ్యర్ధులు మార్గాని భరత్, చింతా అనూరాధ విజయం సాధించారు.
ఇక అసెంబ్లీలో పోటీ చేసిన వారసుల విషయానికొస్తే రాజమహేంద్రవరం సిటీలో టీడీపీ అభ్యర్ధిగా మాజీ కేంద్ర మంత్రి దివంగత కింజరాపు ఎర్రంన్నాయుడు కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు అయిన ఆదిరెడ్డి భవాని విజయం సాధించారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ కుమారుడు ముత్తా శశిధర్ జనసేన అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. రాజానగరం అసెంబ్లీలో జక్కంపూడి రామ్మోహనరావు కుమారుడు జక్కంపూడి రాజా వైసీపీ నుంచి విజయం సాధించారు. ప్రత్తిపాడు నుంచి పోటీ మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వారసుడుగా టీడీపీ నుంచి పోటీ చేసిన వరుపుల రాజా ఓటమి పాలయ్యారు. అలాగే తుని నుంచి రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల క ష్ణుడు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కొత్తపేట నియోజకవర్గం నుంచి రెండో సారి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే చిర్ల సోమసుందరరెడ్డి కుమారుడు మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వైసీపీ నుంచి మళ్లీ విజయం సాధించారు. మొత్తం మీద వారసుల్లో ఇద్దరు ఎంపీలుగానూ, మూడు అసెంబ్లీల్లోనూ వారసులు పరువు నిలబెట్టారని చెప్పొచ్చు.