ఆంధ్రప్రదేశ్‌

తమ్మినేని ఎన్నిక ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 12: శాసనసభాపతిగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే తమ్మినేని సీతారం ఎన్నిక ఏకగ్రీవమైందని మునిసిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం సాయంత్రం శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ స్పీకర్ పదవికి తమ్మినేని ఒకరే నామినేషన్ దాఖలు చేశారని గురువారం ఎన్నిక నిర్వహించిన అనంతరం అధికారికంగా ప్రకటిస్తారన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన తమ్మినేని స్పీకర్ పదవికి తగిన వ్యక్తిగా చెప్పారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉందన్నారు. సభా విలువలు, గౌరవాన్ని కాపాడే విధంగా ఆయన వ్యవహరిస్తారనే నమ్మకం తమకు ఉందన్నారు. ఈ సందర్భంగా తమ్మినేనికి బొత్సతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు.