ఆంధ్రప్రదేశ్‌

కొత్త జిల్లాల ఏర్పాటుపై త్వరలో కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 12: కొత్త జిల్లాల ఏర్పాటుపై త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో బ్లాక్‌లో తనకు కేటాయించిన చాంబర్‌లో బుధవారం ఆయన లాంఛనంగా ప్రవేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కలెక్టర్లు, అధికారుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఏపీలో సమర్థులైన అధికారులు ఉన్నారని గుర్తు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటులో ఎన్ని సమస్యలు ఉన్నా అధిగమిస్తామని స్పష్టం చేశారు. జఠిలమైన సమస్యలను కూడా ముఖ్యమంత్రి జగన్ సులువుగా అధిగమిస్తారన్నారు. భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ తేదీని కాకుండా, భూమిని స్వాధీనం చేసుకున్న రోజు ఉన్న ధరను భూ యజమానులకు చెల్లిస్తామన్నారు. తాను తొలిసంతకం కూడా ఈ ఫైల్‌మీదే చేశానన్నారు. భూముల రీసర్వే చేస్తామని వెల్లడించారు.