ఆంధ్రప్రదేశ్‌

ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా రోజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 12: నగరి వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా అలకను జగన్ మోహన్‌రెడ్డి తీర్చారు. నామినేటెడ్ పదవుల్లో ప్రధానమైన ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ చైర్‌పర్సన్‌గా రోజాకు పదవిచ్చారు. రెండేళ్ల కాలం పాటు ఆమె ఈ పదవిలో కొనసాగనుంది. టీడీపీలో చంద్రబాబునాయుడును విభేదించిన ఆర్‌కె రోజా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం వైకాపా పార్టీ ఏర్పాటు చేసిన జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచింది. అధికారంలో ఉన్న టీడీపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఫైర్‌బ్రాండ్‌గా మరింత గుర్తింపు పొందింది. 2014 ఎన్నికల్లో దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడుపై పోటీ చేసి స్వల్పమెజారిటీతో గెలిపొందింది. అయితే అటు తరువాత అసెంబ్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో నాడు టీడీపీ ప్రభుత్వం ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది. అయినప్పటికీ రోజా తనదైన శైలిలో అసెంబ్లీ బయట నుండే టీడీపీపై పోరు సాగించి జగన్‌కు అండగా నిలిచింది. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్‌పై 2500 పైచిలుకు ఓట్లతో విజయం సాధించింది. దీంతో నూతన ప్రభుత్వం ఏర్పాటు కాగానే స్వీకర్ పదవి గానీ, మంత్రి పదవి గానీ ఖాయమని విస్తృత ప్రచారం జరిగింది. అయితే మంత్రి వర్గం కూర్పులో చిత్తూరు జిల్లాలో సామాజిక న్యాయం పాటించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నారాయణస్వామికి మంత్రి పదవితో పాటు ఉపముఖ్యమంత్రి పదవిని కూడా ఇచ్చారు. అదే సమయంలో చిత్తూరు జిల్లాలో వైకాపాను ఒంటిచేత్తో నడిపించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. దీంతో రోజాకు మంత్రి పదవి దక్కలేదు. ఈ క్రమంలో తీవ్ర నిరాశకు గురైన రోజా ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి గానీ, అటు తరువాత జరిగిన మంత్రుల ప్రమాణస్వీకారానికి గైర్హాజరై వౌనవ్రతం పాటించారు. రెండురోజుల కిందట వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆమెకు ఫోన్ చేసి విజయవాడకు వచ్చి జగన్‌ను కలవమని సూచించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ఉండడంతో ఆమె ముందుగా సీ ఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ క్రమంలో ఆమెకు ఏపీ ఐఐసీ చైర్‌పర్సన్‌గా పదవి దక్కింది. దీంతో రోజమ్మ అలక తీరినట్లు అయింది.