ఆంధ్రప్రదేశ్‌

సీఎంవో అధికారులకు శాఖల కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 12: ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులకు శాఖలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ముఖ్య సలహాదారుగా అజయ్ కల్లాంకు సాధారణ పరిపాలన, హోం శాఖ, ఆర్థిక, ప్రణాళిక, రెవెన్యూ, శాంతిభద్రతలు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యకలాపాలు కేటాయించారు. వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, విద్యాశాఖ (పాఠశాల, ఇంటర్, ఉన్నత, సాంకేతిక విద్య), పరిశ్రమలు, వాణిజ్యం, వౌలిక వసతులు, పెట్టుబడులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఐటీ, ఇన్‌ఫ్రా, ఇంధన శాఖలను సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేష్‌కు కేటాయించారు.
రవాణా, రహదారులు, భవవాల శాఖ, ఏపీఎస్ ఆర్టీసీ, గృహ నిర్మాణం, ఆహారం, పౌరసరఫరాలు, వినియోగదారుల సమస్యలు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, సెర్ప్, అన్ని సంక్షేమ శాఖలు, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖలను సీఎం కార్యదర్శి ఆరోఖ్యరాజ్‌కు కేటాయించారు. నీటి వనరులు, పర్యావరణం, అటవీ, సాంకేతిక, పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థలు, సీఆర్‌డీఏ, వ్యవసాయం, హార్టికల్చర్, సెరికల్చర్, పర్యాటకం విభాగాలను సీఎం అదనపు కార్యదర్శి కే. ధనుంజయ రెడ్డికి, పశుసంవర్థక శాఖ, పాడి, మత్స్య, సహకార, సంస్కృతి శాఖలను సీఎం అదనపు కార్యదర్శి జే. మురళికి, ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎంపీలు, ఎమ్మెల్యేల విజ్ఞప్తులు డాక్టర్ ముక్తాపురం హరికష్ణకు, ముఖ్యమంత్రికి సంబంధించి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్, అప్పాయింట్‌మెంట్స్, విజిటర్స్ అప్పాయింట్‌ను ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.