ఆంధ్రప్రదేశ్‌

కుడి.. ఎడమైతే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 12: శాసనసభలో కుడి, ఎడమలు తారుమారయ్యాయి. కొద్ది నెలల క్రితం వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రలోకి మారింది. ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా నాడు చంద్రబాబు సీటులో ఆశీనులు కావటంతో పాటు స్పీకర్‌కు కుడి వైపున అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, శాసనసభ్యులు కూర్చున్నారు. కాగా స్పీకర్‌కు ఎడమ వైపున ప్రతిపక్ష నేత చంద్రబాబును అనుసరిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు కూర్చున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు సభలో 151 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా టీడీపీకి 23 మంది ఉన్నారు. ఇక జనసేన తరుపున ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలుపొందటంతో అటు అధికార పార్టీకి, ఇటు ప్రతిపక్షానికి మధ్యేమార్గంగా సీటును ఎంచుకున్నారు. గతంలో టీడీపీ మిత్రపక్షంగా బీజేపీకి కూడా మధ్యలోనే చోటు కల్పించారు. శాసనసభలో వైఎస్సార్, టీడీపీ సభ్యులు, మంత్రులు ఒకరి నొకరు సాదరంగా పలుకరించుకున్నారు. ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులను కలుసుకుని కుశలప్రశ్నలు వేశారు. మంత్రి కొడాలి నాని టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, వల్లభనేని వంశీ తదితరులు పరస్పరం ముచ్చటించుకోవటం విశేషం. రెండు ప్రధాన పార్టీల్లో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వలస వెళ్లిన నేతలు ఉండటంతో శాసనసభలో పరస్పర పలకరింపులతో సందడి నెలకొంది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు ఎడముఖం, పెడముఖంగానే వ్యవహరించటం గమనార్హం.