ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో యూఎస్ నేవీ సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 12: అమెరికా సంయుక్త రాష్ట్రాలతో భారతదేశం స్నేహ పూర్వక సంబంధాల కొనసాగింపు హృద్యంగా సాగుతోంది. ఇరు దేశాల మధ్య సామాజిక సంబంధాల నిర్మాణ క్రమంలో యూఎస్ నౌకాదళానికి చెందిన యుద్ధ నౌక జాన్ పీ ముర్తా సిబ్బంది సందడి చేశారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం విశాఖ తీరానికి చేరుకున్న నౌక జాన్ పీ ముర్తా సిబ్బంది విశాఖ నగరంలోని బాలుర ప్రభుత్వ గృహాన్ని బుధవారం సందర్శించారు. 45 మంది సభ్యులున్న యూఎస్ నేవీ బృందం వారితో ఆటలాడి, పాటలు పాడారు.
ఇరు దేశాల మధ్య సామాజిక సంబంధాల పురోగతి నిమిత్తం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానికంగా కెన్ ఫౌండేషన్, హైదరాబాద్‌లోని యూఎస్ కాన్స్యులేట్ కార్యక్రమాన్ని సమన్వయం చేశాయి. దీనిలో భాగంగా వసతి గృహంలోని విద్యార్థులతో యూఎస్ నేవీ సిబ్బంది మమేకమయ్యారు. విద్యార్థులతో కబడ్డీ, ఖోఖో తదితర ఆటలాడారు. అలాగే తెలుగు, హిందీ, ఇంగ్లీషు గీతాలకు విద్యార్థులు, నేవీ సిబ్బంది డాన్స్‌లు చేశారు.
చిత్రం...విశాఖలో విద్యార్థులతో యూఎస్ నేవీ సిబ్బంది