ఆంధ్రప్రదేశ్‌

తిరుపతి ఎమ్మెల్యే ఎన్నికపై కోర్టుకు టీడీపీ అభ్యర్థి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 12: సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచింది తానేనని, అయితే అధికారులు అవకతవకలకు పాల్పడి ఓడినట్లు ప్రకటించారని ఈ తరుణంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు ఎన్నికల్లో టీడీపీ అభ్యిర్థిగా పోటీ చేసిన సుగుణమ్మ తెలిపారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన టీడీపీ తిరుపతి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సమయంలో జరిగిన అవకతవకల కారణంగాను, అధికారుల తొందరపాటు చర్యలతో వైకాపా అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ప్రజలు తనను గెలిపించారన్నారు. ఓట్ల కౌంటింగ్‌లో 13 రౌండ్లలో కూడా తానే మెజార్టీ సాధించానన్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్స్‌లో 300 ఓట్లను లెక్కించలేదని ఆమె ఆరోపించారు. అలాగే మరో 300 పోస్టల్స్ బ్యాలెట్స్‌లో డబుల్ టిక్ ఇచ్చారన్నారు. ఫలితాలు ప్రకటించే సమయంలో తాను అక్కడే ఉన్నా, తనకు చెప్పకుండానే, తన వద్ద ధ్రువీకరణ సంతకం తీసుకోకుండానే ఆర్వో వైకాపా అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటించారని సుగుణమ్మ ఆరోపించారు. తానీ విషయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లానని త్వరలోనే దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని నాయకుల సమావేశంలో ప్రకటించారు.