ఆంధ్రప్రదేశ్‌

రుణమాఫీ బకాయిలు వెంటనే విడుదల చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, జూన్ 12: గత ప్రభుత్వం హయాంలో రైతులకు ప్రకటించిన రుణమాఫీ చివరి విడత బకాయిలను వెంటనే విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వైకాపా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం అనంతపురం జిల్లా మడకశిరలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు కురవడం ప్రారంభమైందన్నారు. ఈ సమయంలో రైతులు పంటలు సాగు చేయడానికి పెట్టుబడులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కాబట్టి రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన వైకాపా ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ చివరి విడతలో చెల్లించాల్సిన రూ.8,304ను వెంటనే విడుదల చేయాలన్నారు. ఫలితంగా రాష్ట్రంలో 31,44,000 మంది రైతులకు లాభం చేకూరుతుందన్నారు. గత ప్రభుత్వం చివరి విడత రుణమాఫీపై మార్చి 10వ తేదీన జీఓ జారీ చేసిందని, అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రుణమాఫీ అమలు కాలేదన్నారు. గత ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేస్తూ వైఎస్‌ఆర్ భరోసా పథకాన్ని అక్టోబర్ 15 నుండి ప్రవేశ పెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించి రబీ సీజన్ నుండి రైతుకు పెట్టుబడి కింద రూ.12,500లు ప్రకటించారన్నారు. అయితే ఈసారి ఖరీఫ్‌లో రైతుకు పెట్టుబడి సాయం లేకపోగా గత ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వస్తుందో లేదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. దీంతో రైతులు పెట్టుబడి కోసం దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రుణమాఫీపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన కోరారు.