ఆంధ్రప్రదేశ్‌

జగన్ ప్రభుత్వ నిర్ణయాలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 12: రాష్ట్రంలో జగన్ సారధ్యంలో కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయని బీజేపీ నేత పీ విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖలో పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం స్వాగతించతగ్గ పరిణామంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడి అవినీతి చోటుచేసుకుందని, పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతిపై తాను గతంలోనే సీబీఐ విచారణ కోరానని గుర్తు చేశారు. శాసనసభలో ప్రతిపక్షం బలంగా ఉండాలని, అప్పుడే అధికార పక్షం తప్పిదాలకు తావులేకుండా ఉంటుందన్నారు. అయితే ప్రస్తుతం విపక్షంలో ఉన్న వారిలో అత్యధికులు అవినీతి పంకిలం అంటుకున్నవారేనని ఆరోపించారు. విశాఖలో చోటుచేసుకున్న భూ కుంభకోణంపై గత ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు నివేదికను బయటపెడితే తమకు ఇబ్బందిగా భావించిన టీడీపీ ప్రభుత్వం అందుకు సాహసించలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన ఇసుక ఫ్రీ పాలసీని టీడీపీ నాయకులు దుర్వినియోగం చేశారని, ఇసుకు పేరిట విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తాజాగా జగన్ ప్రభుత్వం ఇసుక పాలసీకి కొత్తరూపు తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలున స్వాగతించారు. అప్పటి వరకూ ఇసుక సరఫరాకు లోటు లేకుండా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో నిర్మాణ రంగం కుదేలై ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీని వ్యతిరేకించడంతోనే టీడీపీ పతనం ఆరంభమైందని విష్ణుకుమార్ రాజు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తన చివరి రోజుల్లో ప్రధానికి వ్యతిరేకంగా చేసిన విమర్శలు, తీసుకున్న యూ టర్న్‌లు ప్రజలు గమనించారన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించడం ఓట్ల కోసం కాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. గత అసెంబ్లీలో తాను 31 గంటల 10 నిముషాలు వివిధ సమస్యలపై మాట్లాడగా, జగన్ కేవలం 26 గంటల 38నిముషాలు మాత్రమే మాట్లాడారన్నారు.