ఆంధ్రప్రదేశ్‌

బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 13: బడ్జెట్ తయారీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో ఈ నెల 19 నుంచి 24 వరకూ సమావేశం కానున్నారు. 19న గృహ నిర్మాణం, వివిధ సంక్షేమ శాఖలు, వ్యవసాయం, మత్స్య, కార్మిక తదితర శాఖలతో, 20న పరిశ్రమలు, ఇంధన, రెవెన్యూ, హోం, పురపాలక శాఖలతో, 21న పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, జలవనరుల శాఖతో, 24న ప్లానింగ్, ఆర్థిక, యువజన సర్వీసులు తదితర శాఖలతో సమావేశం కానున్నారు. అధికారులు అందచేసిన ప్రతిపాదనల ఆధారంగా బడ్జెట్‌ను రూపొందించనున్నారు. ఈ నెలాఖరులోగా పూర్తి బడ్జెట్ శాసన సభ ఆమోదం పొందాల్సి ఉంది. ఈ మేరకు ఈ నెల చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు ఉండే అవకాశం ఉంది.