ఆంధ్రప్రదేశ్‌

ఫిట్‌నెస్ లేని బస్సులు సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జూన్ 13: ఫిట్‌నెస్ లేని పాఠశాలల బస్సులను శుక్రవారం నుండి సీజ్ చేయనున్నట్లు రవాణా, సమాచార శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ బుధవారం నుండి పాఠశాలలు ప్రారంభమయ్యయని, గురువారం సాయంత్రంతో పాఠశాలల బస్సుల ఫిట్‌నెస్ చేయించుకునే గడువు ముగిసిందన్నారు. ఫిట్‌నెస్ లేని బస్సులపై శుక్రవారం నుండి విద్యాశాఖ, రవాణాశాఖ కలిసి ఉమ్మడిగా చర్యలు తీసుకుంటాయని పేర్కొన్నారు. నిన్నటి వరకు ఆడిందే ఆటగా సాగిందని, గత ప్రభుత్వం చూసీ చూడని విధంగా వ్యవహరించిదన్నారు. ఏ స్కూల్ యాజమాన్యాలైనా, మా పార్టీకి చెందిన వారైనా ఫిట్‌నెస్ లేని బస్సులను నడిపితే సీజ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారన్నారు. బస్సుల ఫిట్‌నెస్ విషయంలో ఏదైనా సమాచారం తెలిస్తే ఇవ్వాలని కోరారు.