ఆంధ్రప్రదేశ్‌

నేటి అర్ధరాత్రి నుంచి మళ్లీ చేపలవేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 13: రెండు మాసాల విరామం తరువాత శుక్రవారం అర్ధరాత్రి నుంచి చేపలవేట ఆరంభం కానుంది. దీనికి మత్స్యశాఖ అనుమతినిచ్చింది. వాతావరణం అనుకూలించడం, 60 రోజుల విరామం ముగియడంతో చేపల వేటకు వెళ్ళాల్సిందిగా మత్స్యశాఖ సూచించడంతో ముందుగా పెద్ద బోట్లు సిద్ధమవుతున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్‌లో నాలుగు సముద్రతీర ప్రాంతాల నుంచి చేపలవేటకు మత్స్యకారులు వెళ్ళనున్నారు. ఇందులో విశాఖపట్నం నుంచే అత్యధికంగా 750 బోట్లు ఉండగా, వీటిలో తొలి దశలో సగానికి పైగా చేపలవేటకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్నాయి. కాకినాడలో దాదాపు 400 బోట్లు ఉండగా ఇందులో కొన్ని మాత్రమే శుక్రవారం అర్ధరాత్రి నుంచి సముద్రంలోకి వెళ్ళేందుకు ముహుర్తం పెట్టుకున్నాయి. ఇక మచిలీపట్నంలో 200 బోట్లు వరకు ఉంటాయి. ఇదే తరహాలో కళింగపట్నం సముద్రతీర ప్రాంతంలో ఉండే 200 బోట్లకు సంబంధించి కొన్ని చేపలవేటకు తీసుకువెళ్ళాలని మత్స్యకారులు నిర్ణయించారు. ఏపీలో నాలుగు ముఖ్యమైన ప్రాంతాల నుంచి మొత్తం 1600 బోట్ల వరకు ఉండగా వీటిలో కొన్ని వంతున పారాదీప్ వరకు చేపలవేటకు వెళ్తే తప్ప అనుకున్న మేర పట్టలేమని మత్స్యకారులు చెబుతున్నారు. చాలాకాలం తరువాత మళ్ళీ వేటకు బయలుదేరుతున్న మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే మత్స్యశాఖ సూచనలు చేయడంతో లైఫ్ జాకెట్లు ధరించి, సీపీఎస్, డాట్స్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను వెంట తీసుకువెళ్తున్నారు. ముఖ్యంగా చేపల గమనాన్ని తెలుసుకునే పరికరాన్ని బోట్లలో ఉంచుతున్నారు. అలాగే తీర ప్రాంతం నుంచి పారాదీప్ వంటి దూరప్రాంతాలకు సముద్రంలోకి వెళ్తున్నందున బోటు యజమానులు, కుటుంబ సభ్యులతో ఎప్పటికపుడు అందుబాటులో ఉండే విధంగా సెల్‌ఫోన్లతో మత్స్యకారులు శుక్రవారం అర్ధరాత్రి బయలుదేరేందుకు సిద్ధపడుతున్నారు.
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత చేపలవేటకు బయలుదేరడం ఇదే తొలిసారి అవుతుంది. అందువల్ల చేపలవేటలో ఎదురయ్యే సమస్యలు, దీర్ఘకాలికంగా మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని నిర్ణయించారు. ఇందులో ముఖ్యంగా ఆయిల్ సబ్సిడీ, బోట్ల మరమత్తులు, వలల కొనుగోలు, చేపలవేటకు వెళ్ళలేని రోజుల్లో ఉపాధి కల్పించడం, మధ్యంతర భృతి వంటి సమస్యల గురించి తెలియజేయాలని, అలాగే మత్స్యశాఖకు దీనిపై వినతులు అందివ్వాలని కూడా మత్స్యకారుల సంఘ ప్రతినిధులు ఆలోచన చేస్తున్నారు. అయితే శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆరంభమైన చేపలవేటకు విశాఖ నుంచి తొలి విడతగా దాదాపు 300 బోట్లు బయలుదేరనున్నాయి. మరో వారం రోజుల నుంచి మరికొన్ని సముద్రంలోకి వెళ్ళనున్నాయి.

చిత్రం... విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో చేపల వేటకు సిద్ధమవుతున్న బోట్లు