ఆంధ్రప్రదేశ్‌

తిరుపతిలో చిరువ్యాపారులపై రౌడీ మూకల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 13: తిరుమలకు వెళ్లే రెండో దారి శ్రీవారి మెట్టు మార్గంలో గురువారం వైకాపా నాయకుడని చెప్పుకుంటున్న చెంగల్ రెడ్డి అనే వ్యక్తి, అతని అనుచరులు చిరువ్యాపారులపై దాడిచేసి భయభ్రాంతులకు గురిచేశారు. ఎంతో భక్తితో శ్రీవారి మెట్టుమార్గాన తిరుమలకు నడిచి వెళ్లాలని వచ్చిన భక్తులు రౌడీలు సృష్టించిన అరాచకాలతో భీతావహులయ్యారు. ఎటు వెడుతున్నామో తెలియకుండా పరుగులు తీశారు. శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు అవసరమైన తినుబండారాలు, నీరు, జ్యూస్ ఇతర ఆహార పదార్థాలను విక్రయిస్తూ తిరుపతి, చంద్రగిరి, పెరుమాళ్లపల్లి తదితర ప్రాంతాలకు చెందిన కొంతమంది చిరువ్యాపారులు జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతికి చెందిన చెంగల్ రెడ్డి అనే వ్యక్తి ఏకంగా 12 దుకాణాలను ఏర్పాటు చేశాడు. అన్ని దుకాణాలను ఏర్పాటు చేసుకుంటే తాము జీవించేది ఎలా అని అక్కడున్న చిరు వ్యాపారులు బుధవారం చెంగల్ రెడ్డిని ప్రశ్నించారు. దీంతో చెంగల్‌రెడ్డి గురువారం ఉ. 9.30 గంటల ప్రాంతంలో సుమారు 30 మంది అనుచరులతో శ్రీవారిమెట్టు మార్గం వద్దకు వెళ్లి అక్కడున్న చిరు వ్యాపారులకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా వారి దుకాణాల్లోని వస్తువులను రోడ్డుపై పడేసి అడ్డుపడ్డవారిని చితకబాది యుద్ధ వాతావరణం సృష్టించారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. చెంగల్‌రెడ్డి అనుచరులు సృష్టించిన అరాచకంతో అక్కడ ఏం జరుగుతోందో తెలియక అటువైపు వెళ్తున్న భక్తులు పరుగులు తీశారు. ఈ ఘటనలో కొంత మంది చిరువ్యాపారులకు రక్తస్రావం జరిగింది. దీంతో పవిత్రమైన శ్రీవారి మెట్టు మార్గాలు రక్తంతో తడిసాయి. వాస్తవానికి శ్రీవారిమెట్టు ప్రారంభంలో టీటీడీ భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. అయితే ఈ సంఘటన శ్రీవారి మెట్టు మార్గ మధ్యంలో జరగడంతో వారి దృష్టికి రాలేదని తెలుస్తోంది. ఈ విషయం గుర్తించిన టీటీడీ భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లేలోపే చెంగల్ రెడ్డి తాపీగా తన అనుచరులతో ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయాడు. కాగా గాయపడిన చిరువ్యాపారులను సిఐటియు నాయకులు రుయా ఆసుపత్రికి తరలించారు.