ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై మరో ముందడగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14: ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే దిశగా మరో అడుగు పడింది. విలీన ప్రక్రియను వేగవంతం చేసే చర్యల్లో భాగంగా వివిధ అంశాలను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నియమించింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి సీ ఆంజనేయులు రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో సభ్యులుగా రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు మాజీ డైరెక్టర్ సుదర్శన్ పదం, ఆర్థిక శాఖ కార్యదర్శి, కన్వీనర్‌గా ఆర్టీసీ ఈడీ ఉంటారు. విలీన ప్రక్రియ అవసరమైన విధానాల రూపకల్పన, విలీనం వల్ల వచ్చే సమస్యలు, వాటిని అధిగమించేందుకు పరిష్కారాలను సూచించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న డీజల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టడంపై సాధ్యాసాధ్యాలను, ఉద్యోగులకు బకాయిల చెల్లింపు, పేరుకుపోయిన బ్యాంక్ రుణాలు, ప్రస్తుత ఆప్పుల చెల్లింపు, ఖర్చుల తగ్గింపు అంశాలపై కూడా కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఎలక్ట్రికల్ బస్సుల ఏర్పాటు అంశంపై కమిటీకి సహకరించేందుకు మరో ముగ్గురిని నియమించింది. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజన్సీ మాజీ ఎండీ వి.్భక్తవత్సలం, సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్‌కి చెందిన ప్రొఫెసర్ సి.రామచంద్రయ్య, ప్రాజెక్టు ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ నిపుణుడి సేవలు వినియోగించుకునేందుకు వీలు కల్పించింది. మూడు నెలల్లోగా కమిటీ నివేదిక అందించాలని ఆదేశించింది.