ఆంధ్రప్రదేశ్‌

విశాఖ నుంచి మరిన్ని విమానాలు నడపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 14: నవ్యాంధ్రలో వేగవంతంగా విస్తరిస్తూ, అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం నుంచి మరిన్ని విమాన సర్వీసులు నడపాల్సిన అవసరం ఉందని ఏపీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ (ఏపీఏటీఏ) విజ్ఞప్తి చేసింది. ఎయిర్ ఇండియా డైరెక్టర్, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరితో కలిసి ఏపీఏటీఏ ప్రతినిధులు ఎయిర్ ఇండియా సీఎండీ అశ్వని లోహానీని ఢిల్లీలో శుక్రవారం కలిసి పలు అంశాలపై చర్చించారు. విదేశాలకు వెళ్లే ప్రయాణీకులకు అనకూలంగా విశాఖ నుంచి కనెక్టింగ్ విమానాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవని ఏపీఏటీఏ ఉపాధ్యక్షడు ఓ నరేష్‌కుమార్ ఎయిర్ ఇండియా సీఎండీకి వివరించారు. విశాఖ నుంచి చెన్నైకి నడిపే సర్వీసును అక్కడ కొలంబో విమానానికి అనుసంధానించాలని, కోల్‌కతాకు రెండు విమానాలు నడుపుతూ వాటిని ఖాట్మాండు, టింపు వెళ్లే విమానాలకు అనుసంధానించాలని కోరారు. అలాగే విశాఖ నుంచి ఢిల్లీకి మరో సర్వీసును నడపాలని, దీన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్‌ఏ) విమానానికి అనుసంధానం చేయాలని కోరారు. ప్రస్తుతం విశాఖ నుంచి దుబాయ్‌కి నడుస్తున్న విమానం హైదరాబాద్ మీదుగా వెళ్తూ ఎక్కువ సేపు నిలిపివేయడం వల్ల ప్రయాణీకులకు తీవ్ర అసౌకర్యంగా ఉంటోందని వివరించారు. వీటితో పాటు విశాఖ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై పట్టణాలకు మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. విశాఖ విమానాశ్రయం నుంచి సరకు ఎగుమతుల ఛార్జీల విషయంలో వివక్ష కొనసాగుతోందని సీఎండీ దృష్టికి తీసుకువెళ్లారు. విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు సరకు రవాణా ఛార్జీలు రూ.40 నుంచి రూ.50కి పెంచారని తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ ఛార్జీలు యధాతథంగా కొనసాగిస్తున్నారన్నారు. దీంతో విశాఖ నుంచి ఎగుమతి కావాల్సిన సరకు రవాణా తెలంగాణాకు తరలిపోతోందని వివరించారు. తద్వారా విశాఖ విమానాశ్రయం ఆదాయాన్ని కోల్పోతోందన్నారు. దీనిపై దృష్టి సారించి, సరకు రవాణా ఛార్జీలు తగ్గించాలని కోరారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎండీ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారని నరేష్ కుమార్ తెలిపారు.