ఆంధ్రప్రదేశ్‌

పోలవరానికి సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాలని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు సూచించారు. ఉపరాష్టప్రతి నివాసంలో శుక్రవారం కేంద్ర జలవనరులశాఖ మంత్రి షెకావత్ ఉప రాష్టప్రతి వెంకయ్యను మార్యద పూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి ప్రాజెక్టు పోలవరం నిర్మాణం గురించి ఉప రాష్టప్రతి ఈ సందర్భంగా షెకావత్‌తో మాట్లాడారు. 1981-82లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ప్రస్తావాన్ని ఆయనకు వివరించారు. విభజన సమయంలో జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహిస్తున్న గోదావరి, పెన్నా నదులను కావేరితో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలు, తమిళనాడు ప్రాంతాల్లోని కరవు ప్రాంతాలకు సాగు, తాగు నీరందించేదుకు పోలవరం ప్రాజెక్టు దోహదపడుతుందని ఆయన అన్నారు. ఏపీ ప్రభుత్వం రూ. 3,000 కోట్ల విడుదల చేయాలని కేంద్రాన్ని ఇప్పటికే పలుమార్లు కోరిందని చెప్పారు. ఈ మొత్తాన్ని నాబార్డు ద్వారా పోలవరం ప్రాజెక్టుకు విడుదల చేసే విధంగా అవసరమైన చొరవ తీసుకోవాలన్నారు. నిధుల్లేక ఆలస్య కాకుడదన్నదే తన ఆకాంక్షగా ఉపరాష్టప్రతి పేర్కొన్నారు. అలాగే ప్రాజెక్టు విస్తరణకు సంబంధించిన అడ్డంకుల్ని తొలగించేందుకు పర్యావరణ మంత్రిత్వాశాఖతో సంప్రదింపులు జరపాలని కేంద్ర మంత్రికి సూచించారు. ఉప రాష్టప్రతి సూచనలకు మంత్రి సానుకూలంగా స్పందించారు.