ఆంధ్రప్రదేశ్‌

ఏ అవకాశాన్నీ వదలను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం రాష్టప్రతి భవన్‌లో జరిగే నీతి ఆయోగ్ ఐదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయనున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోదీ మనసు కరిగేంత వరకు తన ప్రయత్నాలు కొనసాగుతాయని ఆయన చెప్పారు. లోకసభ డిప్యూటీ స్పీకర్ పదవి గురించి బీజేపీ నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని ఆయన స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు శుక్రవారం ఢిల్లీకి వచ్చిన జగన్ సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీ ల అమలు, కొన్ని ఇతర కీలక అంశాల గురించి దాదాపు అర గంట పాటు చర్చించారు. ముఖ్యమంత్రి జగన్ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. విజయసాయి రెడ్డి, లోకసభలో పార్టీ పక్షం నాయకుడు మిథున్ రెడ్డి, రాజ్యసభ
సభ్యుడు వి. ప్రభాకర్ రెడ్డి, లోకసభ సభ్యులు రఘురామ కృష్ణమరాజు, అవినాష్ రెడ్డి తదితరులు ఉన్నారు. జగన్ ఏపికి ప్రత్యేక హోదా, ఇతర అంశాలపై వినతి పత్రాన్ని అమిత్ షాకు అందజేశారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు అంశం కూడా చర్చకు వచ్చిందని అంటున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం, విభజన హామీల అమలు గురించి అమిత్ షాతో ప్రత్యేకంగా చర్చించినట్లు సమావేశానంతరం జగన్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఏపికి ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోదీ మనసు కరిగించండి, ఒక మంచి మాట పిఎంతో చెప్పాలని అమిత్ షాను కోరినట్లు జగన్ చెప్పారు. ఏపికి ప్రత్యేక హోదా సాధించేంత వరకు తన ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి, ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వటం గురించి ప్రధాని, ఇతర మంత్రులతో చర్చిస్తూనే ఉంటానని జగన్ తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఎంత ఉన్నదనేది వివరించే లేఖను కూడా అమిత్ షాకు అందజేసినట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా, విభజన సమస్యలు, రాష్ట్రాన్ని అదుకోవటం తదితర అంశాలు అమిత్ షా మంత్రిత్వ శాఖల పరిధిలోనివి కాబట్టే ఆయనను కలుసుకున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది, వీటి నుండి బైట పడేందుకు మీ సహాయం ఎంతో అవసరమని అమిత్ షాతో చెప్పినట్లు ఆయన తెలిపారు. అమిత్ షా స్పందన ఎలా ఉన్నదని ఒక విలేకరి ప్రశ్నించగా ఈ అంశాలపై మాట్లాడుతూనే ఉండాలి అప్పుడే వారు మెత్తపడి పరిస్థితి తమకు అనుకూలంగా మారుతుందని ఆయన వివరించారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఏపికి ప్రత్యేక హోదా గురించి గట్టిగా మాట్లాడుతానన్నారు. దీని కోసమే తాను ఢిల్లీకి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఏ.పికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నరేంద్ర మోదీని ఒప్పించాలని అమిత్ షాను కోరినట్లు జగన్ చెప్పారు. దేవుడు కరుణిస్తే ఏపికి తప్పకుండా ప్రత్యేక హోదా వస్తుందని జగన్ చెప్పారు.
లోకసభ డిప్యూటీ స్పీకర్ పదవిపై ఎలాంటి ఊహాగానాలకు తావివ్వకూడదని జగన్ విలేకరులకు సూచించారు. డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకుంటున్నారా? అని ప్రశ్నించగా దీనిపై ఊహాగానాలు చేయవద్దన్నారు. లోకసభ డిప్యూటీ స్పీకర్ పదవి గురించి తమకు ఎవ్వరు ఎలాంటి ప్రతిపాదన చేయలేదు, ఎవ్వరు తమతో మాట్లాడలేదు, తాము కూడా ఈ అంశంపై ఎవ్వరితో ఎలాంటి చర్చలు జరపలేదు, అందుకే ఈ అంశంపై మీరు ఊహాగానాలు చేయటం మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. లోకసభ డిప్యూటీ స్పీకర్ పదవి కావాలని అడగలేదన్నారు.