ఆంధ్రప్రదేశ్‌

విదేశీ పర్యాటకులను ప్రోత్సహిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, జూన్ 14: విదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడానికి విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరంతోపాటు శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రాంతాల్లో వీసా లేకుండా వారిని అనుమతించేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ (అవంతి శ్రీనివాస్) ప్రకటించారు. గోదావరి పరీవాహక ప్రాంతాన్ని టూరిస్టు హబ్‌గా తమ ప్రభుత్వం తీర్చిదిద్దుతుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో శుక్రవారం గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కార్యాలయంలో మంత్రి విలేఖర్లతో మాట్లాడారు. తమ ప్రభుత్వం క్రీడలు, టూరిజానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రకృతి సంపదకు నిలయమైన గోదావరి పరీవాహక ప్రాంతాలైన పాపికొండలు, పోలవరం ప్రాజెక్టు, పిచ్చుకల్లంక, అయోధ్యలంక తదితర ప్రాంతాలను టూరిస్టు ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామన్నారు. టూరిజం అభివృద్ధికి బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్‌ను కోరనున్నట్టు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రధాన ఆలయాలైన ద్వారకాతిరుమల, అన్నవరం, కాణిపాకం క్షేత్రాల్లో అభివృద్ధికి కూడా నిధులు కేటాయిస్తామని, తద్వారా టూరిస్టులను ఆకట్టుకునేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇండోర్ స్టేడియంలు నిర్మిస్తామని, ఇప్పటికే మంజూరై నిర్మాణ దశలో ఉన్న మినీ స్టేడియంలకు కూడా అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. శుక్రవారం గవర్నర్ ప్రసంగం తమ ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను ప్రతిబింబించేలా ఉన్నాయని, గవర్నర్ ప్రసంగం వింటుంటే దివంగత వైఎస్సార్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గుర్తుకు వచ్చాయని మంత్రి శ్రీనివాస్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర చరిత్రలోనే గొప్ప సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారని, అన్ని వర్గాల వారిని సంతృప్తిపరిచేలా ఉప ముఖ్యమంత్రి పదవులను కేటాయించారని మంత్రి పేర్కొన్నారు.