ఆంధ్రప్రదేశ్‌

పులివెందులలో మంచినీటి ఎద్దడి సంగతి చూడండి: తులసిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14: వైఎస్‌ఆర్ కడప జిల్లా పులివెందులకు చెందిన జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆ నియోజకవర్గ ప్రజలకు గుక్కెడు మంచినీరు లభించకపోవడం విడ్డూరమని పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. పులివెందుల పట్టణానికి, నియోజకవర్గంలోని 177 గ్రామాలకు చిత్రావతి నదిమీద పార్నపల్లె వద్ద నిర్మించిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పైపుల ద్వారా సురక్షిత మంచినీరు సరఫరా చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేశారన్నారు. మోటార్లు పనిచేయని కారణంగా గతవారం రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. దీనివల్ల పులివెందుల పట్టణం, గ్రామీణ మండలం, లింగాల, సింహాద్రి పురం మండలాల్లోని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.