ఆంధ్రప్రదేశ్‌

ఐదేళ్ల పాలనలో లోపాలపై గళమెత్తిన టీడీపీ నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14: గత ఐదేళ్ల పాలనలో జరిగిన తప్పులపై టీడీపీ నేతలు గళమెత్తారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమికి కారణాలపై విశే్లషించేందుకు టీడీపీ అభ్యర్థులతో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని విజయవాడలో శుక్రవారం నిర్వహించారు. పార్టీ ఓటమికి కారణాలపై నిర్మోహమాటంగా చెప్పాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కోరారు. దీంతో కొంతమంది నేతలు తమ అభిప్రాయలను చంద్రబాబుతో పంచుకున్నారు. వేలాది మందితో టెలీకాన్ఫరెన్సు నిర్వహించడాన్ని సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తప్పుపట్టారు. ఈ కాన్ఫరెన్సుల వల్ల వాస్తవాలు చెప్పే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఆర్టీజీఎస్ నివేదికలే కొంప ముంచాయని ఎమ్మెల్సీ జి.శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. వాస్తవానికి దూరంగా ఉన్న సంతృప్తి సర్వే వివరాలు తప్పుదోవ పట్టించాయన్నారు. గతంలోనూ, ఇప్పుడూ అధికారులను పక్కన పెట్టుకుని, వారికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కొంప మునిగిందన్నారు. పార్టీలో మానవ సంబంధాలు తగ్గిపోయాయని జూపూడి ప్రభాకర్ వ్యాఖ్యానించారు. పార్టీ నేతలకు, కార్యకర్తలకు చంద్రబాబు దూరమయ్యారన్న అభిప్రాయం ఏర్పడిందని, పార్టీ నిర్లక్ష్యానికి గురవుతున్న విషయాన్ని గమనించలేదన్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం చేసిన అక్రమాలపై ఎన్నికల సమయంలో ప్రజలు గుర్తు చేసుకున్నారని, గ్రామాల్లో నేతల అవినీతిపై పార్టీ అధినేతకు చెప్పే అవకాశమే లేకుండా చేశారని మరో నేత దివ్వవాణి విమర్శించారు. చంద్రబాబు చుట్టూ చేరిన బృందమే వాస్తవాలు తెలియకుండా చేశారని ఆరోపించారు. పార్టీలో న్యాయ విభాగం పటిష్టపరచాలని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సూచించారు. వైకాపా తమపై పెడుతున్న కేసులను అధిగమించేందుకు వీలుగా లీగల్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. సంక్షోభ సమయంలోనే ప్రజలకు చంద్రబాబు గుర్తొస్తారని, ఇతర సమయాల్లో వేరే వారివైపు చూస్తారని వ్యాఖ్యానించారు. ఆయన అవసరం ఈ రాష్ట్రానికి ఉందన్న విషయంలో త్వరలో తెలుస్తుందన్నారు. విభేదాలు వల్ల కొంత నష్టపోయామని, ఇకపై కలిసి పని చేస్తామని అనంతపురం నేతలు తెలిపారు. జన్మభూమి కమిటీ తీరు, ఇసుక వ్యవహారం, పంచాయతీ సర్పంచ్‌లను పీఐసీలుగా నియామకం వంటి అంశాలపై కూడా కొంతమంది ప్రస్తావించారు.