ఆంధ్రప్రదేశ్‌

19 నుంచి నీట్ జాతీయ కోటా అడ్మిషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ -యూజీ 2019 ఫలితాల, జాతీయ ర్యాంకులను ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ అడ్మిషన్లకు సన్నాహాలు చేస్తోంది. మెడికల్ అడ్మిషన్ల వ్యవహారాన్ని ఎంసీసీ పర్యవేక్షించనుంది. రాష్ట్ర కోటా సీట్లకు వేరుగా నోటిఫికేషన్ జారీ అవుతుంది. జాతీయ కోటా తొలి రౌండ్ 19 రిజిస్ట్రేషన్ 19 నుండి 24 వరకూ కొనసాగుతుంది. 25వ తేదీ ఛాయిస్ లాకింగ్ ఉంటుంది. 26న సీట్ల కేటాయింపు జరుగుతుంది. 28వ తేదీ నుండి జూలై 3లోగా సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలి. ఇక రెండో రౌండ్ జూలై 6 నుండి 8వ తేదీ మధ్య రిజిస్ట్రేషన్ ఉంటుంది. 9వ తేదీన ఛాయిస్ లాకింగ్ ఉంటుంది. 10వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుంది. వారంతా జూలై 13 నుండి 22 మధ్య ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలి. మాప్ అప్ రౌండ్ ఆగస్టు 13 నుండి 15 వరకూ జరుగుతుంది. ఆ రౌండ్‌లో సీట్ల కేటాయింపు ఆగస్టు 17న జరుగుతుంది. వారంతా ఆగస్టు 20 నుండి 26 మధ్య సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలి. ఇంకా ఏమైనా సీట్లు మిగిలితే వాటిపై ఆగస్టు 27న నిర్ణయం తీసుకుంటారు.
ఇందుకోసం అభ్యర్థులు ఆన్‌లైన్ మెడికల్ కౌనె్సలింగ్ పోర్టల్ ఎంసీసీ డాట్ ఎన్‌ఐసీ డాట్ ఇన్‌కు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఈ సందర్భంగా వారు తమ రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించి తమ ఆప్షన్లను సూచించాలి. సీటు కేటాయింపు జరిగితే వారు తమ తమ కాలేజీలకు వెళ్లి రిపోర్టు చేయవచ్చు లేదా కేటాయించిన కాలేజీ ఇష్టం లేదని కూడా చెప్పవచ్చు. వారంతా తమ రెండో రౌండ్‌లో సీట్లు కేటాయింపునకు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే డీమ్డ్ వర్శిటీలకు సైతం రిజిస్ట్రేషన్ చేసుకోవల్సి ఉంటుంది.
నీట్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 72, 083 మంది అర్హత సాధించారు. నీట్ పరీక్షకు 15,19,375 మంది రిజిస్టర్ చేసుకోగా, వారిలో 14,10,755 మంది హాజరయ్యారు. 3,51,279 మంది అబ్బాయిలు, 4,45,761 మంది అమ్మాయిలు కలిపి 7,97, 042 మంది అర్హత సాధించారు. క్వాలిఫై అయిన వారిలో ముగ్గురు ట్రాన్స్ జండర్లు కూడా ఉన్నారు. పరీక్షకు హాజరైన వారిలో ఎన్‌ఆర్‌ఐలు 1884 మంది, ఒసీఐలు 675 మంది, పీఐఓలు 63 మంది, విదేశీయులు 687 మంది ఈసారి పరీక్ష రాశారు. 6,80,414 మంది పురుషులు కాగా, 8,38,955 మంది స్ర్తిలు, ఆరు మంది ట్రాన్స్‌జండర్ ఆరుగురు ఉన్నారు. అన్‌రిజర్వుడ్ అభ్యర్ధులు 5,34,072 మంది, ఎస్సీలు 2,11,308 మంది, ఎస్టీలు 96456 మంది, ఒబీసీలు 6,77,544 మంది రాశారు. అర్హత సాధించిన వారిలో 3,75,635 మంది ఒబీసీలు, 99,890 మంది ఎస్సీలు, 35,272 మంది ఎస్టీలు, అన్‌రిజర్వుడ్ 2,86,245 మంది ఉన్నారు. పీహెచ్ కేటగిరిలో 5411 మంది రిజిస్టర్ చేసుకోగా వారిలో 2185 మంది అర్హత సాధించారు.
జాతీయ స్థాయిలో 701 మార్కులు సాధించి రాజస్థాన్‌కు చెందిన నళిన్ ఖండేల్‌వాల్ 99.99 పర్సంటైల్ సాధించి మొదటి ర్యాంకు సాధించారు. ఢిల్లీకి చెందిన బాస్విక్ బన్సాల్ 700 మార్కులతో రెండో ర్యాంకు, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అక్షత్ కౌషిక్ 700 మార్కులతో మూడో ర్యాంకు సాధించింది. జాతీయ స్థాయిలో 695 మార్కులతో ఏడో ర్యాంకు సాధించిన జీ మాధురీ రెడ్డి తెలంగాణలో స్టేట్ టాపర్‌గా నిలవగా, జాతీయ స్థాయిలో 16వ ర్యాంకు సాధించిన ఖురేషీ అష్ర 690 మార్కులతో ఆంధ్రప్రదేశ్ టాపర్‌గా నిలిచారు. 685 మార్కులతో పిల్లి భాను శివతేజ ఆంధ్రాలో రెండోస్థానంలోనూ, 685 మార్కులతో సొద్దం శ్రీనందన్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. మహిళల విభాగంలో జాతీయ టాపర్‌గా తెలంగాణకు చెందిన జీ మాధురిరెడ్డి నిలిచారు. రెండోస్థానంలో మధ్యప్రదేశ్‌కు చెందిన కీర్తి అగర్వాల్, మూడో స్థానంలో ఖరేషీ అష్ర, ,నాలుగో స్థానంలో గుజరాత్‌కు చెందిన హర్షవీ నాయన్ జోబన్‌పుత్ర, ఐదో స్థానంలో కేరళకు చెందిన హృద్యలక్ష్మీ బోస్ సాధించారు.