ఆంధ్రప్రదేశ్‌

ప్రజలు చాలా వివేకంగా ఏకగ్రీవ తీర్పు ఇచ్చారు : వైకాపా ఎమ్మెల్యేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జూన్ 14: ప్రజలు చాలా వివేకవంతంగా స్పష్టంగా ఏకగ్రీవ తీర్పు ఇచ్చారని, యువకుడైన ముఖ్యమంత్రి జగన్‌మోన్‌రెడ్డి పరిపాలనలో ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తున్నారని పలాస వైకాపా ఎమ్మెల్యే అప్పలరాజు అన్నారు.
శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉండబోతోందో స్పష్టంగా చెప్పారన్నారు. గతంలో గవర్నర్ ప్రసంగం 52 పేజీలు ఉంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో 15 పేజీలు మాత్రమే ఉందన్నారు.
నవరత్నాలతో ప్రజలను చైతన్యవంతం చేశారని పేర్కొన్నారు. మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఎప్పుడూ జాతీయస్థాయిని మించి రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెపుతూ చారిత్రాత్మక తప్పిదం చేశారన్నారు. 2018-2019లో దేశంలో వృద్ధిరేటు 6.5శాతం ఉంటే రాష్ట్రంలో 11.6శాతం ఉన్నట్లు చంద్రబాబు చెప్పారని, దీనివల్ల ఏపీ ఇంత అభివృద్ధి చెందితే ప్రత్యేకహోదా ఎందుకని కేంద్రం మెలిక పెట్టిందన్నారు. పలాస ప్రాంతంలోని ఉద్దానం కిడ్నీ బాధితులకు రూ.10వేలు పెన్షన్ ఇవ్వడం సంతోషకరమన్నారు.
ప్రత్యేక హోదా నినాదాన్ని
చంద్రబాబు అవహేళన చేశారు
* గూడూరు ఎమ్మేల్యే వరప్రసాద్
నాలుగేళ్ల పాటు ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు అవహేళన చేశారని గూడూరు వైకాపా ఎమ్మెల్యే వరప్రసాద్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు ఆత్మ గౌరవంగా బ్రతికేలా నవరత్నాల ద్వారా భరోసా లభించిందన్నారు. సూళ్ళూరుపేట, గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాలకు మేలు చేసే దుగరాజపట్నం పోర్టు నిర్మాణాన్ని చంద్రబాబు అడ్డుకుని ప్రైవేట్ పోర్టులకు మేలు చేసేందుకు రామాయపట్నం తీసుకువెళ్లారని విమర్శించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో 50శాతం సామాజిక న్యాయం పాటిస్తామని జగన్ హామీ ఇవ్వడాన్ని ప్రజలు స్వాగతించారని, మద్యపాన నిషేదం అమలు చేస్తానన్న హామీని జనం విశ్వసించారని పేర్కొన్నారు. పోలవరం నిర్మాణాన్ని చంద్రబాబు సొంత ప్రయోజనాలకు వాడుకున్నారన్నారు.
రాష్టమ్రంతా జగన్ పరిపాలన గురించే చర్చ
* ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున,
టీజేఆర్ సుధాకర్‌బాబు
జగన్ పరిపాలన చూస్తుంటే దళితులు, బీసీలు, మైనార్టీలు ఇక ఆత్మాభిమానంతో ఉండవచ్చన్న భరోసా వచ్చిందని, ఇప్పుడు రాష్టమ్రంతటా జగన్ పరిపాలన గురించే చర్చ జరుగుతోందని వైకాపా ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, టీజేఆర్ సుధాకర్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో వారు మాట్లాడుతూ అభివృద్ధి పథంలో వైఎస్‌ఆర్ ఒక అడుకు ముందుకు వేస్తే జగన్ రెండు అడుగులు ముందుకు వేస్తున్నారన్నారు. ప్రత్యేకహోదా తప్పని సరిగా తీసుకు వస్తామని, గత ముఖ్యమంత్రి ఆర్‌టీసీని అంటుకోవడానికి బయపడితే జగన్ మాత్రం దానిని ప్రభుత్వంలో విలీనం చేయనున్నారని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం చక్కగా ఉందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్న నాయకుడు జగన్ అన్నారు.