ఆంధ్రప్రదేశ్‌

ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జూన్ 15: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీఓఎస్‌ఎస్-ఓపెన్‌స్కూల్) పదవ తరగతి ఫలితాల్లో 92.65శాతం ఉత్తీర్ణతతో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలువగా, 6.26 శాతంతో నెల్లూరుజిల్లాకు చివరి స్థానం దక్కింది.
ఇంటర్‌లో 83.75శాతంతో గుంటూరు జిల్లా ప్రథమ స్థానం సాధించగా 24.56 శాతంతో నెల్లూరు చివరి స్థానంలో నిలిచింది. శనివారం విజయవాడలోని సబ్‌కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో రాష్ట్ర ఓపెన్ స్కూల్ పదవ తరగతి, ఇంటర్ పరీక్షా ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. పదవ తరగతిలో మొత్తంగా 69.93 శాతం ఉత్తీర్ణత సాధించారు. దీనిలో బాలురు 67.58 శాతం, బాలికలు 73.70 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌లో మొత్తంగా ఉత్తీర్ణత శాతం 67.82గా నమోదైంది. దీనిలో బాలురు 66.45శాతం, బాలికలు 70.18 శాతం ఉత్తీర్ణత సాధించారు. పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు సంబంధించి రీకౌంటింగ్, స్కాన్ కాపీ, రీ వెరిఫికేషన్‌కు జవాబు పత్రాలను పొందేందుకు 17వతేదీ నుండి 27వతేదీ వరకు ఫీజు చెల్లించాలని మంత్రి పేర్కొన్నారు. ఈ తేదీని పొడిగించే అవకాశం లేదని, రీ కౌంటింగ్‌కు పదవ తరగతికి రూ.100, ఇంటర్‌కు రూ.200 చెల్లించాలని, స్కాన్ కాపీ, రీ వెరిఫికేషన్‌కు సంబంధించి పదవ తరగతికి రూ.1000, ఇంటర్‌కు రూ.1000 చెల్లించాలని మంత్రి పేర్కొన్నారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు జూన్ 17నుండి 21వతేదీ వరకు ఎటువంటి ఆలస్య రుసుం లేకుండా సబ్జెక్టుకు పదవ తరగతికి రూ.100, ఇంటర్‌కు రూ.150 చెల్లించాలని, ప్రాక్టికల్స్‌కు ఒక్కొక్క పేపర్‌కు పదవ తరగతికి రూ.50, ఇంటర్‌కు రూ.100 చెల్లించాలని పేర్కొన్నారు. ఇంప్రూవ్‌మెంట్ కోసం పదవ తరగతికి పేపర్‌కు రూ.100, ఇంటర్‌కు రూ.250 చెల్లించాలన్నారు. ఆలస్యం రుసుం రూ.25 చెల్లించి జూన్ 22నుండి 24వతేదీ వరకు, రూ.50తో జూన్ 25, 26 తేదీల్లో చెల్లించవచ్చని తెలిపారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూలై 11వతేదీ నుండి 18వతేదీ వరకు నిర్వహిస్తారన్నారు.
ఏపీఓఎస్‌ఎస్ డైరెక్టర్ నరసింహరావు, కాకినాడ ఆర్‌జెడీ దేవానందరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి రాజ్యలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం 2019-2020 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు విధివిధానాలను విడుదల చేశారు. జూన్ 28వతేదీ నుండి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారని, దరఖాస్తులు సమర్పించడానికి ఆగస్టు 26వ తేదీ చివరి తేదీగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి ఆగస్టు 31 చివరి తేదీ అని, ఆలస్య రుసుం చెల్లించి సెప్టెంబర్ 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

చిత్రం...ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల చేస్తున్న విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్