ఆంధ్రప్రదేశ్‌

గవర్నర్ ప్రసంగంలో రైతు రుణమాఫీ ప్రస్తావన ఏదీ?: తులసిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 15: రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగంలో రైతు రుణమాఫీ అంశాన్ని ప్రస్తావించకపోవడం గర్హనీయమని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి అన్నారు. రైతులకు రుణమాఫీ పథకం కింద గత ప్రభుత్వం 58.29 లక్షల మంది రైతులకు రూ. 24,500 కోట్ల రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించిందని, ఇందులో 3 దశల్లో రూ. 15,147 కోట్లు వ్యవసాయ రుణాలను గత ప్రభుత్వం మాఫీ చేసిందని శనివారం ఒక ప్రకటనలో తులసిరెడ్డి తెలిపారు. ఇంకా రూ. 8,353 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ కాలేదన్నారు. వీటిని మాఫీ చేస్తూ 2019, మార్చి 10న గత ప్రభుత్వం జీవో జారీ చేసిందని, అయితే ఎన్నికల కోడ్ అమలులోకొచ్చిన కారణంగా జీవో అమలు కాలేదన్నారు. ఈ లోపల గత ప్రభుత్వం దిగిపోయి, నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. పెండింగ్‌లో ఉన్న రూ. 8,353 కోట్ల వ్యవసాయ రుణాలను నూతన ప్రభుత్వం తమ ఖాతాల్లో వేస్తుందని రైతులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని, కానీ నూతన ప్రభుత్వం ఈ విషయమై స్పష్టత ఇవ్వలేదని, గవర్నర్ ప్రసంగంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం గర్హనీయమని తులసీరెడ్డి అన్నారు. జగన్ ప్రభుత్వం నిజంగా రైతు పక్షపాత ప్రభుత్వమైతే పెండింగ్‌లో ఉన్న రూ.8,353 కోట్ల రైతు రుణమాఫీ నిధులను వెంటనే విడుదల చేయాలని తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు.