ఆంధ్రప్రదేశ్‌

రాజధానిపై అపోహలు తగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 15: రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలోని రెంబో బ్లాక్‌లో వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ కార్యాలయ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని పనులపై రైతుల్లో అపోహలను రేకెత్తిస్తున్నారని, అవినీతిని ప్రక్షాళనచేసి రాజధాని పనులు సజావుగా జరిగేలా తమ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని తెలిపారు. సీఎం జగన్ ఆశయాల కనుగుణంగా బడుగు, బలహీన వర్గాలకు చేయూత అందించే దిశగా కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. మునిసిపాలిటీలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను రూ 18 వేలుగా ముఖ్యమంత్రి ప్రకటించారని గుర్తుచేశారు. కేంద్రంతో సఖ్యతతో ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేది జగన్ సంకల్పమన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. మునిసిపాలిటీల్లో తాగునీటి వసతి, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణాల్లో వౌలిక వసతుల కల్పన చేపడతామని వివరించారు.
చిత్రం...మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ