ఆంధ్రప్రదేశ్‌

ప్రతి ఎకరాకూ సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 15: రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి సాగునీరందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని జలవనరులశాఖ మంత్రి పీ అనిల్‌కుమార్ యాదవ్ వెల్లడించారు. జలవనరుల శాఖలో అవినీతికి ఆస్కారం లేకుండా విధి విధానాలను కఠినతరం చేస్తామని స్పష్టం చేశారు. సచివాలయం నాలుగో బ్లాక్‌లో శనివారం తన కార్యాలయంలో మంత్రి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ కేబినెట్‌లో అత్యంత కీలకమైన శాఖను ముఖ్యమంత్రి జగన్ తనకు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అందివచ్చిన ఈ అవకాశాన్ని సవాల్‌గా తీసుకుని పట్టుదలతో జలవనరుల విభాగాన్ని పటిష్టం చేస్తామని ప్రకటించారు. అవినీతికి తావులేని పారదర్శక పాలనతో రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్ట్‌లను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేస్తామని తెలిపారు. పుత్తూరు మునిసిపాలిటీకి 0.03 టీఎంసీల నీరందించే ఫైల్‌పై ఆయన ఈ సందర్భంగా సంతకం చేశారు. తొలుత వేదపండితుల ఆశీర్వచనాలు అందుకుని ఛాంబర్‌లో ప్రవేశించారు.
చిత్రం...బాధ్యతలు స్వీకరిస్తున్న మంత్రి అనిల్‌కుమార్ యాదవ్