ఆంధ్రప్రదేశ్‌

26 మంది బాల కార్మికులను కాపాడిన టాస్క్ఫోర్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, జూన్ 15: పేరెన్నికగన్న బిస్కెట్ (పార్లె-జి) ఫ్యాక్టరీలో పని చేస్తున్న 26 మంది బాల కార్మికులను ప్రభుత్వ బాల కార్మికుల నిరోధక టాస్క్ఫోర్సు బృందం కాపాడింది.
అమసివిన్ని ప్రాంతంలోని బిస్కెట్ ఫ్యాక్టరీలో బాల కార్మికులతో పని చేయిస్తున్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్సు సిబ్బంది ఆకస్మిక దాడి నిర్వహించి 26 మంది బాల కార్మికులను కాపాడినట్లు విధానసభ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అశ్విని రాథోర్ తెలిపారు. ఫ్యాక్టరీ నుంచి విముక్తి కల్పించిన బాల కార్మికులను బాలల జ్యువెనల్ కేంద్రానికి తరలించినట్లు చెప్పారు.
మహిళా శిశు అభివృద్ధి శాఖ ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు ఫ్యాక్టరీ యజమానిపై కేసు జ్యువెనల్ జస్టిస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
విముక్తి కల్పించిన బాలల వయస్సు 13 నుంచి 17 మధ్య ఉన్నట్లు చెప్పారు. బాల కార్మికులకు విముక్తి కల్పించేందుకు ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమం ద్వారా 6 రోజుల్లో 51 మందిని విడిపించినట్లు జిల్లా బాలల సంరక్షణ అధికారి నవనీత్ స్వర్ణకార్ తెలిపారు. బిస్కెట్ ఫ్యాక్టరీ నుంచి విడిపించిన వారిలో ఓడిశా, మధ్య ప్రదేశ్, జార్ఖండ్‌కు చెందిన వారున్నారని చెప్పారు. ఆ బాలుర తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించామని ఆయన తెలిపారు. విముక్తి పొందిన బాలల స్టేట్‌మెంట్ ప్రకారం ప్రతి రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు యజమాన్యం పని తీసుకునేదని, వేతనాలు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు మాత్రమే చెల్లించేదని నవనీత్ స్వర్ణకార్ చెప్పారు.