ఆంధ్రప్రదేశ్‌

ఎస్సీ రైతుల భూమి స్వాధీన ఉత్తర్వులు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ రూరల్, జూన్ 16: ‘గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలన్నిటినీ అడ్డుకుంటాం’ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను తూచ తప్పకుండా ఆచరిస్తున్న రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు తన నియోజకవర్గ పరిధిలో ఎస్సీలు సాగుచేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకోవాలంటూ గత ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేయించారు. వివరాల్లోకి వెళితే... తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో 1976లో ప్రభుత్వం సర్వే నెంబరు 122, 123లో 65 ఎకరాల సాగుభూమి కేటాయించింది. ఒక్కో కుటుంబానికి 45 సెంట్లు భూమి కేటాయించారు. సుమారు 130 కుటుంబాలు ఈ భూమిని సాగుచేసుకుంటున్నాయి. అయితే ఈ భూములపై గత ప్రభుత్వంలో కొందరు పెద్దల కన్నుపడింది. పర్యాటకాభివృద్ధి పేరుతో ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఒక ప్రజాప్రతినిధి చక్రం తిప్పారు. అనుకున్నదే తడవుగా ఈ భూములను స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 5న జీవోఆర్‌టీ 190 పేరిట ఉత్తర్వులు జారీచేసింది. ఎటువంటి పరిహారం చెల్లించకుండానే భూములు స్వాధీనం చేసుకోవాలని భావించింది. దీనితో సాగుచేసుకుంటున్న షెడ్యూల్డు కులాల రైతుల్లో ఆవేదన పెల్లుబికింది. రైతుల తరపున దళిత బహుజన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినాపురపు సూర్యనారాయణ పోరాటం సాగించారు. కాగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు దృష్టికి ఈ విషయం వెళ్లింది. దీనితో స్పందించిన ఆయన ఈ వ్యవహారాన్ని పూర్తిగా సమీక్షించారు. ఆయన చొరవతో దళితుల జీవనోపాధికి విఘాతం కలిగించే ఉత్తర్వులను నిలపుపచేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఉత్తర్వులు జారీచేశారు.