ఆంధ్రప్రదేశ్‌

సిక్కోలు రక్షణకు మరో ఉద్యమం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 16: రైతాంగ పోరాటాలు, నక్సల్‌బరీ ఉద్యమాలకు పుట్టినిల్లయన శ్రీకాకుళం నుంచి మరో ఉద్యమం చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వెనుకబడిన ఈ జిల్లాను రక్షించుకునేందుకు ఇక్కడి ఉద్యమనేతలు నడుంబిగిస్తున్నారు. సర్దార్ గౌతు లచ్చన్న, ఎన్.జి.రంగా వంటి నేతలు రైతాంగాన్ని ఉద్ధరించిన రాజకీయ నాయకులుగా జాతీయస్థాయిలో కీర్తిపొందారు. స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా రైతు ఉద్యమాన్ని నిర్వహించడానికి బాపూజీ నుంచి ఆశీస్సులు అందుకుని ‘రైతురంగా’ అని పేరొందిన ప్రొఫెసర్ ఎన్.జి.రంగా స్ఫూర్తితో సిక్కోల్ గడ్డ నుంచి అన్నదాతలు రైతు రక్షణ యాత్రలకు నాందిపలికి, ‘మదుపునిధి’ కోసం ఉద్యమాల గడ్డయిన సిక్కోల్ పోరాటాలకు వేదికయింది. మళ్ళీ ఇప్పుడు జిల్లా పరిరక్షణ కోసం ఐక్యపోరాట కమిటీగా ఎన్టీవోల నేత చౌదరి పురుషోత్తంనాయుడు నేతృత్వంలో ఎచ్చెర్ల, రాజాం అసెంబ్లీ సెగ్మెంట్లు శ్రీకాకుళం జిల్లా నుంచి వేరుచేయడానికి వీల్లేదంటూ మరో ఉద్యమానికి ఊపిరి పోస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాల్లో అనంతపురం అతి పెద్ద జిల్లాకాగా, అతి చిన్న జిల్లా శ్రీకాకుళం. జిల్లాలను సాధారణంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలుగా విభజించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తొమ్మిది జిల్లాలను కోస్తాంధ్రగా, కర్నూలు, చిత్తూరు, కడప, అనంతరంపురం రాయలసీయగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం ఏపీలో 13 నుంచి 25 జిల్లాలుగా పెంచేందుకు కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక అదనపు జిల్లాగా ఏర్పాటు చేసేందుకు అధికారులు భౌగోళిక నైసర్గిక స్వరూపంతోకాకుండా అసెంబ్లీ సిగ్మెంట్లు వారీగా జిల్లాలకు పంపకాలు చేసేందుకు సమాలోచన చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఉద్యమాల పురిటి గడ్డ శ్రీకాకుళం నుంచి ఐక్యపోరాట కమిటీ ఆవిర్భావానికి నాంది పలుకుతోంది. శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ సిగ్మెంట్లు, అందులో ఏడు అసెంబ్లీ సిగ్మెంట్లు శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోనివి. ఎచ్చెర్ల, రాజాం విజయనగరం పార్లమెంటు పరిధికి వెళ్తే, పాలకొండ అరుకు పార్లమెంటులో ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా జిల్లాల ఏర్పాటు జరిగితే - అత్యంత వెనుకబాటు కలిగిన శ్రీకాకుళం జిల్లాలో గల పారిశ్రామిక వాడ ఇకపై ఉండదు. ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న అంబేద్కర్ యూనివర్సిటీ కూడా విజయనగరం జిల్లాలోకే వెళ్ళిపోతోంది. ట్రిపుల్ ఐటీ, పాలిటెక్నిక్ కాలేజీ, ప్రభుత్వ మద్యం సరఫరా చేసే సంస్థతోపాటుగా రాజాంలోని పరిశ్రమలన్నీ విజయనగరం జిల్లా పరిధిలోకే చేరిపోతాయి. ఇక మిగిలింది పేదరికం, వలసకూలీలు, తీరంవెంబడి కాలిన కడుపులతో మిగిలే మత్స్యకార కుటుంబాలు. 5,837 కిలోమీటర్లు వైశాల్యం కలిగిన అతిచిన్న జిల్లాయైన శ్రీకాకుళం జనాభా 2011 లెక్కల ప్రకారం 2,699,471 దీనిబట్టి 462 జనసాంద్రత కలిగిన జిల్లా. ఎటువంటి అదనపు ఆదాయవనరులు లేని వెనుకబడిన జిల్లాను అభివృద్ధి చేయకుండా, జిల్లాలో ఆర్థిక వనరులకు కీలకమైన పైడిభీమవరం పారిశ్రామికవాడను విజయనగరం జిల్లాకు తరలించడం, విశ్వవిద్యాలయాన్ని పొరుగు జిల్లాలో కలిపేయడం వంటి మార్పులపై ఉద్యమాలకు ఊపిరిగా చెప్పబడే సిక్కోల్ నుంచే అదనపు జిల్లాలు ఏర్పాటును అడ్డుకోవాలని శ్రీకాకుళం జిల్లా పోరాట ఐక్యవేదిక నడుంబిగిస్తోంది.
తెలుగు ప్రజల గడ్డను రెండుగా విభజించినా, ఇప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భూభాగాలు మిగతా చాలా రాష్ట్రాలతో పోల్చితే పెద్దవే. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పది జిల్లాలు నుంచి ఏకంగా 33 జిల్లాలు చేశారు. ఫలితంగా అక్కడ పరిపాలనా సౌలభ్యం కలిగింది. ఆయా జిల్లాల్లో ప్రజలకు, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు ఇదివరకటి కంటే దగ్గరగా ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య పెరగడంతో పనుల వేగం పెరిగింది. ఇవన్నీ తెలంగాణలో జిల్లాలు పెంచితే అక్కడ భౌగోళిక స్వరూపం బట్టి ప్రయోజనాలు కలిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలు పెంచితే కలిగేది నష్టాలు - కష్టాలు తప్ప తెలంగాణ రాష్ట్రం మాదిరిగా ప్రయోజనాలు కలిగే పరిస్థితులు ఇక్కడ అసెంబ్లీ సిగ్మెంట్లు నైసర్గిక పరిస్థితులు సహకరించబోవంటూ జిల్లాకు చెందిన భౌగోళిక విశే్లషకులు సుస్పష్టం చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందే టీడీపీ, వైసీపీ వేటికవే ప్రణాళికలు రూపొందించుకుని జిల్లాలు పెంచే యోచనలో అడుగులు వేసాయి. టీడీపీ ఓటమి చవిచూడడంతో ఆ ప్రభుత్వ ఆలోచనలు ఇకలేనట్లే. వైసీపీ ప్లాన్ ప్రకారం జిల్లాల విభజన జరగబోతోంది. ఏపీలో ప్రస్తుతం 13 జిల్లాలున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల మేరకు జిల్లాల విభజన చేస్తామంటూ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల్లో ఒకటి. ఆ మాదిరిగానే జిల్లాలు విభజన చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలతోపాటు మరో 12 జిల్లాలు ఏర్పాటు చేసేందుకు సంసిద్ధం అవుతున్నారు. ఐతే, జగన్ తన ఆసక్తి మేరకు ఒక గిరిజన జిల్లాను కూడా ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అది శ్రీకాకుళం - విజయనగరం జిల్లాల మధ్య ఏజెన్సీలో ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. అదే జరిగితే పాలకొండ అసెంబ్లీ సెగ్మెంటు గిరిజన జిల్లాలో విలీనం అయిపోవడం ఖాయం. అంటే - మొత్తంగా 26 జిల్లాలుగా సరికొత్త ఏపీ అవతరణ జరగనున్నది.
కానీ, ఏపీ ఖజానా ఖాళీ కావడంతో ఈ జిల్లాల ప్రతిపాదన ఎంతవరకూ సక్సెస్ అవుతుందన్న అనుమానాలు రాష్ట్ర ఉన్నతాధికారులను వెంటాడుతోంది. ఇలాంటి సందిగ్థ పరిస్థితుల్లో జిల్లాల ఏర్పాటు మాట పక్కన పెడితే - శ్రీకాకుళం జిల్లాకు ఆర్థికనాడి ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాలు. వాటిని విజయనగం జిల్లాల్లో విలీనం చేస్తే సిక్కోల్ నుంచి మరో పోరాటం తప్పదంటూ జిల్లా పరిరక్షణ ఐక్యపోరాట వేదిక హెచ్చరిస్తోంది!