ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబు యూరప్ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 19: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వారం రోజుల పాటు యూరప్‌లో పర్యటించనున్నారు. వేసవి దృష్ట్యా కుటుంబ సభ్యులతో కలసి వ్యక్తిగతంగా గడపనున్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనుమడు దేవాన్ష్‌లతో కలిసి బయల్దేరి వెళ్లారు. యూరప్ పర్యటన సందర్భంగా వారం రోజుల పాటు పార్టీ కార్యక్రమాలను అక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. తిరిగి ఈనెల 25న అమరావతి చేరుకుంటారు. గత కొద్ది రోజుల క్రితమే పర్యటన షెడ్యూల్ నిర్ణయించుకున్నారు. అయితే శాసనసభ సమావేశాల సందర్భంగా వాయిదా వేసుకున్నారు. గత ఐదేళ్లుగా ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపిన ఆయన ఈ వారం రోజులు కుటుంబ సభ్యులతో కలసి విశ్రాంతి తీసుకోనున్నారు.