ఆంధ్రప్రదేశ్‌

ఇకపై ఆన్‌లైన్‌లో ఫైర్ అటెండెంట్ సర్ట్ఫికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 19: ఆన్‌లైన్‌లో సేవలు అందించటం ద్వారా ఫైర్ అటెండెంట్ సర్ట్ఫికెట్ జారీలో అవినీతిని నియంత్రించే వీలు కలుగుతుందని రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్‌ఎం కిశోర్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో ఆన్‌లైన్‌లో ఫైర్ అటెండెంట్ సర్ట్ఫికెట్ల మంజూరు ప్రక్రియను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిశోర్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు సులభతరమైన విధానంలో ఫైర్ అటెండెంట్ సర్ట్ఫికెట్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. అగ్నిప్రమాదాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పిస్తామని చెప్పారు. సర్ట్ఫికెట్ జారీలో ఆన్‌లైన్ విధానం వల్ల త్వరగా అనుమతులు మంజూరవుతాయని తెలిపారు. ఫైర్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వద్ద నుంచి సిబ్బంది లంచాలు డిమాండ్ చేయకుండా నియంత్రించేందుకు ఈ సేవలు ఉపయోగ పడతాయని వివరించారు. గతంలో కంటే ఈ ఏడాది అగ్నిప్రమాదాలను నిలువరించ గలిగామన్నారు. ఘటన జరిగిన వెంటనే ప్రమాద స్థలానికి ఐదు నుంచి పది వాహనాలను తరలించి తీవ్రతను తగ్గిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా విపత్తులశాఖ సేవలు అందిస్తోందని వివరించారు.కార్యక్రమంలో అగ్నిమాపకశాఖ డీజీ కె సత్యనారాయణ, విపత్తుల నిర్వహణశాఖ డైరెక్టర్ కె జయరాం నాయక్, అదనపు డైరెక్టర్ పి వెంకటరమణ, సదరన్ రీజియన్ ఫైర్ ఆఫీసర్ ఈ స్వామి, ఈస్ట్రన్ రీజియన్ అధికారి జి. శ్రీనివాసులు, కృష్ణాజిల్లా అగ్నిమాపక అధికారి డి నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.