ఆంధ్రప్రదేశ్‌

ఎలిఫెంట్ కారిడార్ ఏర్పాటుకు నిపుణుల రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురుపాం, జూన్ 19: శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సంచరిస్తూ బీభత్సం సృష్టిస్తున్న ఏనుగుల సమస్య శాశ్వత పరిష్కారానికి నిపుణుల కమిటీ రానుంది. ఈరెండు జిల్లాలోని ప్రజలకు, రైతులకు నష్టం కలిగిస్తున్న ఏనుగులను తరలించే చర్యలు అటవీశాఖ చేపడుతోంది. గత 10 నెలలుగా కురుపాం నియోజకవర్గంలోని పలు మండలాల ప్రజలను ఇబ్బంది పెడుతూ, పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగులను తరలించేందుకు ఎలిఫెంట్ కారిడార్ ఏర్పాటుకు నిపుణుల బృందాన్ని రప్పిస్తున్నామని అటవీ శాఖ జిల్లా అధికారి కె.లక్ష్మణ్ తెలిపారు. బుధవారం కురుపాం అటవీశాఖ కార్యాలయానికి వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఈనెల 28వ తేదీన ముగ్గురు సభ్యుల నిపుణుల బృందం ఈప్రాంతానికి వస్తోందని అన్నారు. కేరళ, తమిళనాడు ప్రాంతాలకు చెందిన వ్యవసాయ, ఉద్యానవన, అటవీశాఖలకు సంబంధించిన నిపుణులు ఇక్కడకు రానున్నారు. ఈ ప్రాంతంలో ఎలిఫెంట్ జోన్ ఏర్పాటుకు వాతావరణం అనువైనది, లేనిదీ, స్థల సేకరణ, నిధుల వినియోగం వాటిపై పూర్తిస్థాయిలో పరిశీలన జరుపుతారన్నారు. ఎలిఫెంట్ జోన్ ఏర్పాటు చేయాలంటే సుమారుగా 3వేల ఎకరాలు భూమి ఉండాలన్నారు. ప్రతీ రోజు ఒక్కొక్క ఏనుగు 20 కిలోమీటర్లు తిరిగేలా స్థలం ఉండాలి. పూర్తిస్థాయిలో నీరు, 200కిలోల ఆహారం ఒక్కొక్క ఏనుగుకు అవసరమవుతాయన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని ఎలిఫెంట్ కారిడార్ ఏర్పాటు కోసం పరిశీలిస్తారన్నారు. ఏనుగుల కారిడర్ ఏర్పాటుకు జెకె ప్రాంతంతోపాటు శ్రీకాకుళం జిల్లాలోని దోనుబాయి ప్రాంతాన్ని పరిశీలిస్తారన్నారు.